Balakrishna: బాలయ్య, బాబీ సినిమా నుంచి ఒక పవర్ ఫుల్ డైలాగ్ లీక్…ఇలాంటివి బాలయ్యకే సెట్ అవుతాయి.. ఊర మాస్ అంతే…

శ్రీరామనవమి సందర్భంగా ఈ డైలాగుని సినిమా యూనిట్ వాళ్లే కావాలని లీక్ చేశారంటూ మరి కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనప్పటికి బాలయ్య బాబు చెప్పిన ఈ డైలాగ్ సినిమా మొత్తానికే చాలా హైలైట్ గా నిలవబోతున్నట్టుగా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : April 17, 2024 4:23 pm

Balakrishna

Follow us on

Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉంది. ఇక ఈ ఫ్యామిలీ నుంచి మొదట గా “నందమూరి తారక రామారావు” గారు రావడం ఎనలేని కీర్తి ప్రతిష్టలను అందుకోవడం జరిగిపోయింది. ఇక ఈయన తర్వాత బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు వచ్చారు. అయితే ప్రస్తుతం వీళ్లు చేస్తున్న సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాయి.

ఇక ఇలాంటి క్రమంలోనే వీళ్ళు చేసే సినిమాల విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఇప్పటికే బాలయ్య 109 సినిమాని చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఎలాగైనా సరే మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని బాలయ్య చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి మరొక డైలాగ్ లీక్ అయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక డైలాగ్ అయితే తెగ వైరల్ అవుతుంది.

ఇక శ్రీరామనవమి సందర్భంగా ఈ డైలాగుని సినిమా యూనిట్ వాళ్లే కావాలని లీక్ చేశారంటూ మరి కొంతమంది విమర్శలు చేస్తున్నారు.
ఇక ఏది ఏమైనప్పటికి బాలయ్య బాబు చెప్పిన ఈ డైలాగ్ సినిమా మొత్తానికే చాలా హైలైట్ గా నిలవబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబు ఈ సినిమాతో భారీ హిట్టు కొట్టబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఆ డైలాగ్ ఏంటంటే విలన్స్ దగ్గరికి వెళ్ళిన బాలయ్య రౌడీని ఉద్దేశించి ” నువ్వు డిస్కవరీ ఛానల్లో వేటాడే సింహాన్ని చూసుంటావ్, అదే సింహం నీ ముందు నిలబడి నీ మీదకే వేటకస్తే ఎలా ఉంటుందో చూస్తావా” అంటూ ఈ డైలాగు సాగుతుంది. ఇక ఇది చూసిన బాలయ్య బాబు అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

ఇక బాలయ్య బాబు సినిమాలో ఎక్కడ కూడా ఇలాంటి పవర్ ఫుల్ డైలాగ్ లు తగ్గకుండా చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే హిట్టు కొట్టి బాలయ్య బాబు స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు. అలాగే బాబీ కూడా ఒక భారీ హిట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.