2025 Telugu Hit Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ముందుకు తీసుకెళ్తున్న వాళ్లలో స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు సైతం మొదటి స్థానంలో ఉన్నారు. ఇక 2025 వ సంవత్సరం చివరి దశకి చేరుకున్న సందర్భంలో ఈ ఇయర్ టాలీవుడ్ ను కాపాడిన సినిమాలేంటి ఏ స్టార్ హీరో తమ స్టార్ డమ్ ను పెంచుకున్నారు. అలాగే యంగ్ హీరోలు వాళ్ళ సత్తాను చాటుకున్నారా? లేదా? అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో వెంకటేష్ హీరోగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సూపర్ సక్సెస్ ను సాధించింది… 300 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టిన సినిమాగా నిలిచింది. ఒకరకంగా ఈ ఇయర్ స్టార్టింగ్ లోనే గొప్ప విజయాన్ని సాధించి పెట్టింది…ఇక రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘గేమ్ చేంజర్’ మూవీ ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయింది… అలాగే బాలయ్య హీరోగా వచ్చిన ‘డాకూ మహారాజ్’ మూవీ మాస్ హిట్ గా నిలిచింది…
ఇక నాగ చైతన్య హీరోగా వచ్చిన ‘తండెల్’ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది… సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ‘మజాకా’ ప్లాప్ అయింది. అలాగే నాని ప్రొడ్యూస్ చేసిన కోర్ట్ సినిమా చిన్న సినిమాల్లో పెద్ద హిట్ గా నిలిచింది. మ్యాడ్ మూవీ కి సీక్వెల్ గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ మూవీ ఆశించిన మేరకు అలరించలేకపోయింది… నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ వచ్చిన రాబిన్ హుడ్ 60 కోట్లు పెట్టి తీస్తే కేవలం 6 కోట్ల కలెక్షన్స్ ను మాత్రమే రాబట్టింది…
సిద్దు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన జాక్ సినిమా ప్లాప్ అయింది. ఓదెల 2 కూడా డిజాస్టర్ అయింది. కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ ప్లాప్ అయింది. తిన్ హీరోగా వచ్చిన తమ్ముడు సినిమా డిజాస్టర్ గా మారింది…అలాగే నాని హీరోగా వచ్చిన హిట్ 3 ఒకే అనిపించుకుంది. సింగిల్ సినిమా పూర్ కామెడీ ఎంటర్ టైనర్ గా నిలిచింది…
ధనుష్ మెయిన్ లీడ్ లో నాగార్జున ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసిన కుబేర సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్నప్పటికి కలెక్షన్స్ ను మాత్రం కొల్లగొట్టలేకపోయింది.. 8 వసంతాలు గుడ్ అటెంప్ట్ గా నిలిచింది… మంచు విష్ణు భారీ అంచనాలు పెట్టుకున్న కన్నప్ప సినిమా సైతం ఆశించిన మేరకు మెప్పించలేకపోయింది…
నితిన్ హీరోగా వచ్చిన తమ్ముడు డిజాస్టర్ అయింది. విజయ్ దేవరకొండ గౌతం తిన్నని కాంబోలో వచ్చిన కింగ్ డమ్ సైతం ప్లాప్ అయింది. పరదా మూవీ ఒకే అనిపించుకుంది…క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన ఘాటి ప్లాప్ అయింది…అందులో ఏమాత్రం ఎమోషన్ వర్కౌట్ కాకపోవడంతో ఈ సినిమాను ఆదరించేవారు కరువయ్యారు…పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన హరిహర వీరమల్లు ప్లాప్ అయింది. కానీ ఓజీ సినిమాతో సక్సెస్ ను అందుకున్నాడు…యూత్ అట్రాక్ట్ చేసే కాన్సెప్ట్ తో వచ్చి విజయం సాధించిన సినిమాల్లో లిటిల్ హార్ట్స్ సినిమా
మిత్ర మండలి, తెలుసు కదా, కే ర్యాంప్ లాంటి సినిమాలు పర్లేదు అనిపించాయి. రవితేజ హీరోగా వచ్చిన మాస్ జాతర ప్లాప్ అయింది…రాజు యాడ్ రాంబాయి హిట్ అయింది. 2 కోట్లతో చేస్తే 20 కోట్ల పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టింది…ప్రేమంటే మూవీ ప్లాప్ అయింది. ఆంధ్రా కింగ్ తాలూకా పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. కానీ కలెక్షన్స్ ను మాత్రం పెద్దగా రాలేదు…
మోగ్లీ మంచి అంచనాలతో వచ్చినప్పటికి అది పెద్దగా సక్సెస్ అవ్వలేదు… శ్రీకాంత్ కొడుకు హీరోగా వచ్చిన ఛాంపియన్ మూవీ ఒకే అనిపించుకుంది. ఆది సాయి కుమార్ హీరోగా వచ్చిన శంబాల మూవీ సక్సెస్ ఫుల్ టాక్ తో ముందుకు సాగుతోంది. ఈషా మూవీ పెద్దగా మెప్పించలేకపోతోంది…దండోరా మూవీ మంచి అటెంప్ట్ గా నిలిచింది. కులం పేరుతో ఎవరు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అనేది చాలా క్లియర్ గా చూపించారు…
ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్ నిలిచిన సినిమాల్లో పవన్ కళ్యాణ్ ఓజీ మొదటి స్థానం లో ఉండగా, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా రెండో స్థానాన్ని సంపాదించుకుంది…రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది…