Hanuman Movie: చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన చాలా మంది నటులు పెరిగి పెద్దయ్యాక హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కానీ సక్సెస్ ను అందుకోలేక చాలా మంది ఇండస్ట్రీకి దూరమయ్యారు. కానీ మాస్టర్ తేజ మాత్రం గ్యాప్ తీసుకొని సినిమాలు తీస్తున్నా విభిన్న కథలతో వెండితెరపై కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన నటించిన ప్రతీ సినిమా ప్రత్యేకమైనదే అని చెప్పవచ్చు. ఆయన నటించిన చిత్రాల్లో ‘జాంబిరెడ్డి’ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇప్పుడు తాజాగా ‘హనుమాన్’ చిత్రంతో రాబోతున్నారు. అయితే ఈ రెండు సినిమాలను ప్రశాంత్ వర్మ అనే డైరెక్టర్ తెరకెక్కించాడు. ఈ సినిమా గురించి ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు.
చిన్న వయసులోనే కేవలం 4 సినిమాలు తీసి ఫేమస్ అయ్యాడు ప్రశాంత్ వర్మ. అయితే ఆయన తాజాగా తీసిన ‘హనుమాన్’ చిత్రంపై కొన్ని క్రిటిక్స్ వస్తున్నాయి. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ ను అనుసరించే హనుమాన్ తీశారని కొందరు.. ఆ సినిమా ప్రభావం హనుమాన్ పై ఉంటుందని మరికొందరు అంటున్నారు. ఈ తరుణంలో ప్రశాంత్ వర్మ కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన హనుమాన్ సినిమాపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాడు.
హనుమాన్ కథ విభిన్నంగా ఉంటుంది. ఇది అందరూ అనుకుంటున్నట్లు పౌరాణిక చిత్రం కాదు. సైంటిఫిక్ మూవీ. మనలో చాలా మంది హనుమంతుడిలా ఉండాలని కోరుకుంటారు. అలా కావాలనుకొన్న వారికి ఈ చిత్రం బాగా నచ్చుతుంది. హనుమంతుడి పాత్ర కోసం సంవత్సరం పనిచేశాం. అందుకే ఆ పాత్ర అద్భుతంగా వచ్చింది. పాత్రకు తగ్గట్లే సాహసాలు కూడా కనిపిస్తాయి.. అని ప్రశాంత్ వర్మ అన్నారు.
ఒక సినిమా ప్రభావం మరోసినిమా ఉంటుందని ఎప్పుడూ అనుకోను..సాధ్యమైనంత వరకు ప్రతీ ఆలోచనలో భిన్నంగానే ఉంటాయి. కాపీ కొట్టి సినిమా తీయాలని ఎవరూ అనుకోరు. ఏ సినిమా గొప్పదనం ఆ సినిమాదే. ఆదిపురుష్ వీఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్ బాగా ఉన్నాయి. హనుమాన్ సినిమా కోసం కూడా ట్రై చేస్తున్నాయి. అయితే కథలో అవసరం ఉన్నంత వరకే ఉపయోగిస్తాం. ఇప్పటి వరకు సినిమా మొత్తంలో 1600 వీఎఫ్ఎక్స్ షాట్లను చేర్చాం. 800 షాట్ల వర్క్ పూర్తయింది. కేవలం వీఎఫ్ఎక్స్ కోసమే రూ.10 కోట్లు ఖర్చ చేశాం.. ముందుగా అనుకున్న దానికంటే ప్లాన్ చేంజ్ కావడంతో బడ్జెట్ పెరిగింది.. అని ప్రశాంత్ వర్మ అన్నారు.