Tollywood Trends: టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు జరగనున్నాయి. ఈ మేడే ఉత్సవాలని మే ఒకటిన హైదరాబాద్‌లో సినీ ఇండస్ట్రీలోని అన్ని విభాగాలతో కలిసి నిర్వహించనున్నారు. కాగా, దాదాపు పది వేలమందితో భారీస్థాయిలో మేడే సెలబ్రేషన్స్‌ను తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నిర్వహిస్తుంది.

ఇక మరో అప్ డేట్ ఏమిటంటే… ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్లో నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘రాధే శ్యామ్’ మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ వసూళ్లలో మాత్రం దూసుకుపోతోంది. తొలి రోజు ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ. 79 కోట్లు వసూలు చేసింది. మరోవైపు తొలి రోజు వసూళ్లలో అల్లు అర్జున్ చిత్రం ‘పుష్ప’ను ‘రాధే శ్యామ్’ బీట్ చేసింది. తొలి రోజున ‘పుష్ప’ రూ. 71 కోట్లు వసూలు చేసింది.
Also Read: సినీ స్టార్స్ నేటి క్రేజీ పోస్ట్ లు !

ఇక ఇంకో అప్ డేట్ ఏమిటంటే..గతంలో ఓ సూపర్ హిట్ కొడితే అంతకు మించిన మాస్ కథ అన్నట్టు ఉండేది ఎన్‌టీఆర్ స్టోరీ సెలక్షన్. కానీ ఇప్పుడు గేర్ మార్చినట్టు కనిపిస్తోంది. RRR తర్వాత యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథలకు ఓటేస్తున్నాడట. ఈక్రమంలోనే సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబుకి ఓకే చెప్పాడు. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం స్పోర్ట్స్ నేపథ్యంలో కథ సాగుతుందట. ఏప్రిల్ 2వ వారంలో మొదలవ్వొచ్చు. పెద్ది, సాంబడు అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి.

అలాగే మరో అప్ డేట్ ఏమిటంటే.. అనుపమ పరమేశ్వరన్ మెయిన్ రోల్‌లో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘బటర్‌ఫ్లై’. గంటా సతీష్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి అనుపమ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.
Also Read: సినిమా రిలీజై 15 రోజులు కాలేదు.. అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోందా ?
[…] Anasuya Bharadwaj New Movie: ‘పేపర్ బాయ్’ సినిమా ఫేమ్ జయశంకర్ దర్శకత్వంలో అనసూయ భరద్వాజ్ ఓ సినిమా చేస్తోంది. డిఫరెంట్ కాన్సెఫ్ట్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆర్వీ సినిమాస్ బ్యానర్‌పై ఆర్వీ రెడ్డి, శేషు మారంరెడ్డి చాలా గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. సాయికుమార్, వైవా హర్ష, అక్ష పర్థసాని, శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్ర తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. […]