Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. నటి కీర్తిసురేష్ డ్యాన్సులతో రూపొందిన ‘గాంధారి’ అనే మ్యూజిక్ వీడియో ఆల్బమ్ సోమవారం విడుదల కానుంది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్‌లో వెల్లడించింది. అలాగే ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ వీడియో ఆల్బమ్‌ను దీరూట్, సోనీ మ్యూజిక్ సంయుక్తంగా నిర్మించాయి. పవన్ సీహెచ్ సంగీతం అందించాడు. బృందా మాస్టర్ డ్యాన్సులు కంపోజ్ చేసింది.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. సమంత నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ యశోద కోసం నిర్మాతలు రూ.3 కోట్లతో భారీ సెట్‌ను నిర్మించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. మలయాళ నటుడు ఉన్నిముకందన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. హరి, హరీష్ ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Also Read: ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మృతి

ఇక మరో అప్ డేట్ ఏమిటంటే.. తన పెళ్లి గురించి చిరంజీవి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘తాతయ్య ప్రేమలీలలు సినిమా చేస్తున్న రోజులవి. అప్పుడు నూతన్ ప్రసాద్ బిజీ ఆర్టిస్ట్. తనతో షూట్ కోసం పెళ్లి వాయిదా వేసే పరిస్థితి రాగా నిర్మాత షూట్ వాయిదా వేయడంతో సమయానికే పెళ్లి జరిగింది. పెళ్లిపీటలపై కూర్చునేటప్పుడు చొక్కా చిరగగా ‘వెళ్లి బట్టలు మార్చుకోవచ్చుగా’ అని సురేఖ అన్నది. చిరిగిన బట్టలతో తాళి కట్టలేనా? అని అలాగే కట్టేశా’ అని తెలిపారు.

Also Read: రష్మిక ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. 25ఏండ్లకే అన్ని కోట్లు వెనకేసింది..!