Tollywood Stars: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం ఎన్నడూ చూడని జలప్రళయాన్ని చవిచూస్తోంది. కడప, చిత్తూరు జిల్లాలలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి, పదుల సంఖ్యలో ప్రాణ నష్టం, కోట్ల రూపాయల ఆస్థి నష్టం వాటిల్లింది.

వారం రోజులకు పైగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో చెరువులు, కాలువలు, నదులు ఉప్పొంగి జనావాసాలను ముంచేస్తున్నాయి. వరద కారణంగా ఇంతటి దుర్భర పరిస్థితులు ఏర్పడినా, టాలీవుడ్ స్టార్స్ ఒక్కరు కూడా స్పందించలేదు. దుర్భర పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వానికి ఏ ఒక్కరూ అండగా నిలబడలేదు. సాధారణంగా ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు చిత్ర పరిశ్రమ ముందుకు వస్తుంది.
వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కి తమకు తోచిన మొత్తం దానం చేయడం జరుగుతుంది. చాలా కాలంగా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు, ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా మేము ఉన్నాం అంటూ… స్టార్స్ లక్షల రూపాయల చెక్స్ తో ముందుకు వచ్చేవారు.
వారం రోజులకు పైగా రాయలసీమ ప్రజలు వరదలతో అనేక అగచాట్లు పడుతున్నా… సినీ స్టార్స్ నుంచి కనీస స్పందన కరువైంది. ఆర్థిక సాయం సంగతి అటుంచితే… సోషల్ మీడియాలో కామెంట్ చేసినవారు కూడా లేరు. టాలీవుడ్ స్టార్స్ ఇలా బెట్టు చేయడానికి సీఎం జగన్ విధానాలే కారణమన్న మాట వినిపిస్తుంది.
ఏపీలో టికెట్స్ రేట్ల విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు స్టార్ హీరోలకు మింగుడు పడడం లేదు. టికెట్స్ ధరలు తక్కువగా ఉండడంతో పాటు, బెనిఫిట్స్ షోస్ పేరుతో విపరీతంగా టికెట్స్ ధరలు పెంచి అమ్ముకోవడాన్ని ప్రభుత్వం ఖండిస్తోంది. ఈ పరిణామం సదరు స్టార్స్ సినిమా వసూళ్లపై ప్రభావం చూపుతుంది.
Also Read: Acharya: ‘ఆచార్య’ నుంచి మరో ఇంట్రస్టింగ్ అప్డేట్కు రెడీగా ఉన్నారా?
సినిమా బడ్జెట్ లో హీరోలు దాదాపు 40% రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నారని, స్టార్స్ రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే టికెట్స్ ధరలు తగ్గుతాయని, కొందరు వైసీపీ నేతలు కామెంట్స్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం పై వీరు గుర్రుగా ఉన్నారని, అందుకే ప్రభుత్వానికి మద్దతుగా నిలవడం లేదన్న అనధికారిక రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే వరద పరిస్థితులు ఇంకా కొనసాగుతుండగా, కొంచెం లేటుగా స్టార్స్ స్పందించే అవకాశం లేకపోలేదు.
Also Read: Naga Chaitanya: జోష్ టూ లవ్ స్టోరీ.. బర్త్ డే బాయ్ నాగచైతన్య కెరీర్ లో బెస్ట్ చిత్రాలు ఇవే!