Homeఎంటర్టైన్మెంట్తెలుగు హీరోలు పెళ్లి కట్నం ఎంత తీసుకున్నారో తెలుసా?

తెలుగు హీరోలు పెళ్లి కట్నం ఎంత తీసుకున్నారో తెలుసా?

సినీ నటులు అంటే ప్రేక్షకుల్లో యమా క్రేజు ఉంటుంది. వాళ్ల పర్సనల్ జీవితాలపై తెగ మోజు ఉంటుంది. వారికి సంబంధించిన ప్రతీ విషయం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. సినిమాల మీద ఎంత ఇంట్రస్ట్ ఉంటుందో.. వ్యక్తిగత విషయాల మీద అంతకన్నా రెట్టింపు ఆసక్తి ఉంటుంది. అయితే.. అన్ని విషయాలూ ఎలాగోలా తెలుసుకున్నా.. వారి పెళ్లికి కట్నం ఎంత తీసుకున్నారు అనే విషయం మాత్రం అంత ఈజీగా తెలియదు. ఆ వివరాలు మీకోసం. స్టార్ హీరోలు ఎంతెంత డౌరీ తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం.

మహేష్ బాబు – నమ్రతః టాలీవుడ్లో బెస్ట్ కపుల్స్ అనగానే గుర్తొచ్చే జంట మహేష్-నమ్రత. ‘వంశీ’ సినిమా షూటింగ్ లో వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నారు. నమ్రత నేటివ్ ప్లేస్ మహారాష్ట్ర. మరి, టాలీవుడ్ ప్రిన్స్ ను కట్టుకున్న ఈ బ్యూటీ పుట్టింటి నుంచి తెచ్చిన క‌ట్న‌కానుక‌లు ఎంతంటే.. భారీగానే ఉన్నాయి. 15ఏళ్ల క్రిత‌మే ఆమె త‌చ్చిన ఆస్తుల విలువ 75 కోట్ల రూపాయ‌ల‌ని టాక్‌.

రామ్ చరణ్ – ఉపాస‌నః మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, అపోలో హాస్పిటల్స్ అధినేత వార‌సురాలు ఉపాస‌న 2012లో పెళ్లి చేసుకున్నారు. అంత‌కు ముందు వీరిద్ద‌రూ బెస్ట్ ఫ్రెండ్స్‌. ఉపాస‌న త‌న పెళ్లి క‌ట్నంగా 300 కోట్ల వ‌ర‌కు తెచ్చిన‌ట్టు స‌మాచారం. వీళ్ల పెళ్లికి అప్పుడే.. 15 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసిన‌ట్టు అంచ‌నా.

జూ.ఎన్టీఆర్‌-ప్ర‌ణ‌తిః జూనియ‌ర్ పెళ్లి కూడా 2011లోనే జ‌రిగింది. పెద్ద‌లు కుదిర్చిన పెళ్లి వీరిది. ఈ పెళ్లి ద్వారా జూనియ‌ర్ కు 200 కోట్లు క‌ట్నంగా ముట్టిన‌ట్టు స‌మాచారం. ఇక‌, వీరి పెళ్లి కూడా ధూమ్ ధామ్ గా జ‌రిగింది. ఇందుకోసం 18 కోట్ల మేర ఖ‌ర్చైన‌ట్టు స‌మాచారం.

అల్లు అర్జున్ – స్నేహః వీరిద్ద‌రిదీ ప్రేమ వివాహం. చ‌ర‌ణ్-ఉపాస‌న‌ పెళ్లిక‌న్నా.. ఒక ఏడాది ముందే వీళ్ల వివాహం జ‌రిగింది. ఈ పెళ్లి ద్వారా బ‌న్నీకి 100 కోట్ల క‌ట్నం అందిన‌ట్టు తెలుస్తోంది. వీళ్ల పెళ్లి సైతం గ్రాండ్ గానే జ‌రిగింది. ఇందుకోసం 10 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్టు టాక్‌.

గోపీచంద్ – రేష్మః టాలీవుడ్ లో యాక్ష‌న్ హీరోగా పేరు సంపాదించుకున్న గోపీచంద్.. మ‌రో హీరో శ్రీకాంత్ మేన కోడ‌లినే పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి కోసం 8 కోట్ల రూపాయలు క‌ట్నంగా తీసుకున్న‌ట్టు స‌మాచారం.

క‌ల్యాణ్ రామ్ః స్వాతిః నంద‌మూరి హీరో క‌ల్యాణ్ రామ్ 2006లోనే పెళ్లి చేసుకున్నాడు. స్వాతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరిది పెద్ద‌లు సెట్ చేసిన పెళ్లి. క‌ట్నంగా క‌ల్యాణ్ రామ్‌.. 30 కోట్లు తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

నాని-అంజ‌నాః నేచుర‌ల్ స్టార్ గా వెలిగిపోతున్న నాని కూడా ల‌వ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అంజ‌నా అనే యువ‌తితో మూడేళ్లు ల‌వ్ స్టోరీ న‌డిపిన త‌ర్వాత పెళ్లి చేసుకున్నారు. కట్నంగా 3 కోట్ల వ‌ర‌కు తీసుకున్నాడ‌ట ఈ హీరో.

ఆది – అరుణః సాయికుమార్ కుమారుడు ఆది.. అరుణ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దిరి కూడా ప్రేమ వివాహ‌మే. అరుణ కుటుంబం ఆదికి 2 కోట్ల వ‌ర‌కు కట్నం ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

నిఖిల్ – ప‌ల్ల‌వి వ‌ర్మః యంగ్ హీరో నిఖిల్ ప‌ల్ల‌వి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరిది కూడా ప్రేమ పెళ్లే. పెళ్లి చాలా సింపుల్ గా చేసుకున్న ఈ హీరో.. క‌ట్నం మాత్రం 8 కోట్లు తీసుకున్న‌ట్టు స‌మాచారం.

న‌రేష్ – విరూపః అల్ల‌రి న‌రేష్ విరూప‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరి మ్యారేజ్ 2015లో జ‌రిగింది. ఈ పెళ్లికి గానూ న‌రేష్ 5 కోట్ల వ‌ర‌కు క‌ట్నం తీసుకున్న‌ట్టు టాక్‌.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular