https://oktelugu.com/

Megastar 156 Movie : బ్రేకింగ్ : 200 కోట్ల బడ్జెట్.. మెగా 156 విలన్ గా టాలీవుడ్ స్టార్ హీరో!

బింబిసార ఫేమ్ వశిష్ట్ దర్శకత్వంలో ప్రకటించిన మెగా 157 లైన్లో పెట్టాడు. కళ్యాణ్ కృష్ణ మూవీ డిలే అవుతున్న నేపథ్యంలో వశిష్ట్ మూవీ మెగా 156గా మారింది.

Written By:
  • NARESH
  • , Updated On : October 24, 2023 / 07:59 PM IST
    Follow us on

    Megastar 156 Movie : మెగాస్టార్ చిరంజీవి వరుస ప్రాజెక్ట్స్ తో హోరెత్తిస్తున్నారు. గత రెండేళ్లలో చిరంజీవి నాలుగు సినిమాలు విడుదల చేశారు. వాల్తేరు వీరయ్య మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. సంక్రాంతికి విడుదలైన వాల్తేరు వీరయ్య రెండు వందలకు పైగా వసూళ్లు రాబట్టింది. మాస్ మహారాజ్ గెస్ట్ రోల్ చేశాడు. భోళా శంకర్ మాత్రం నిరాశపరిచింది. చిరంజీవి స్వాగ్, స్క్రీన్ ప్రెజెన్స్ అలరించాయి. అయితే కథ, స్క్రీన్ ప్లే దెబ్బతీశాయి. భోళా శంకర్ ఫెయిల్యూర్ నేపథ్యంలో చిరంజీవి దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో చేయాల్సిన మూవీ పక్కన పెట్టారు.

    బింబిసార ఫేమ్ వశిష్ట్ దర్శకత్వంలో ప్రకటించిన మెగా 157 లైన్లో పెట్టాడు. కళ్యాణ్ కృష్ణ మూవీ డిలే అవుతున్న నేపథ్యంలో వశిష్ట్ మూవీ మెగా 156గా మారింది. నేడు హైదరాబాద్ లో ఘనంగా లాంచ్ చేశారు. పూజా కార్యక్రమానికి దర్శక నిర్మాతలతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు హాజరయ్యారు. మెగా 156 సోషియో ఫాంటసీ సబ్జెక్టు. కాన్సెప్ట్ పోస్టర్ తోనే దర్శకుడు ఆకట్టుకున్నాడు.

    పంచ భూతాలైన నింగి నేల భూమి ఆకాశం నిప్పులతో కూడిన లోగో ఆసక్తి రేపింది. కథలో భాగంగా చిరంజీవి వివిధ లోకాలలో సంచరిస్తారనే వాదన ఉంది. ఈ చిత్రానికి చిరు గత చిత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి టైటిల్ పెట్టే ఆలోచన చేశారట. అయితే ఆ చిత్ర నిర్మాత అశ్వినీ దత్ నిరాకరించడంతో మరో టైటిల్ వేటలో ఉన్నారట.

    కాగా మెగా 156 విలన్ గా రానా దగ్గుబాటి ఎంపికయ్యారనేది తాజా న్యూస్. కథ రీత్యా విలన్ రోల్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందట. ఈ పాత్రకు అతీత శక్తులు కూడా ఉంటాయట. ఇలాంటి పాత్రకు భారీకాయుడు, గంభీర స్వరం ఉన్న రానా దగ్గుబాటి కరెక్ట్ అని అతన్ని సంప్రదించారట. రానా కూడా పచ్చజెండా ఊపారట. ఈ మేరకు క్రేజీ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. గతంలో బాహుబలి 1&2, భీమ్లా నాయక్ చిత్రాల్లో రానా విలన్ రోల్స్ చేశారు.