Jr NTR Birthday: జూ ఎన్టీఆర్ పుట్టినరోజుకు అభిమానుల నీరాజనాలు

Jr NTR Birthday: ఎన్టీఆర్ వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. నేటి స్టార్ హీరోల్లో యాక్టింగ్, డైలాగ్, డాన్స్ లన్నిటిలోనూ మేటి అనిపించుకున్నాడు. ‘ఊసరవెల్లి’లా డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కూడా ‘అదుర్స్’ అనిపించాడు. తెలుగు సినిమా వెండి తెర పై ‘బృందావనం’లోని కృష్ణుడిలా తనకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకున్నాడు. నేడు ఈ జూనియర్ తారక రాముని పుట్టినరోజు. ఎన్టీఆర్ చైల్డ్ ఆర్టిస్ట్ గానే మంచి నటన కనబరిచాడు. నేడు టాలీవుడ్ […]

Written By: Shiva, Updated On : May 20, 2022 2:28 pm
Follow us on

Jr NTR Birthday: ఎన్టీఆర్ వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. నేటి స్టార్ హీరోల్లో యాక్టింగ్, డైలాగ్, డాన్స్ లన్నిటిలోనూ మేటి అనిపించుకున్నాడు. ‘ఊసరవెల్లి’లా డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కూడా ‘అదుర్స్’ అనిపించాడు. తెలుగు సినిమా వెండి తెర పై ‘బృందావనం’లోని కృష్ణుడిలా తనకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకున్నాడు.

Jr NTR

నేడు ఈ జూనియర్ తారక రాముని పుట్టినరోజు. ఎన్టీఆర్ చైల్డ్ ఆర్టిస్ట్ గానే మంచి నటన కనబరిచాడు. నేడు టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఎన్టీఆర్ మోస్ట్ వాంటేడ్ హీరోగా మారడం అంత ఈజీగా ఏమి జరగలేదు. ఎన్టీఆర్ చిన్నతనంలోనే ఎంతో కఠినమైన సాధన చేసేవాడు. అందుకే ఎన్టీఆర్ క్యారెక్టర్ లోకి ఒక్కసారి వెళ్లాడంటే యాక్షన్ లో పర్ ఫెక్షన్ కనిపిస్తోంది.

Also Read: NTR- Koratala Movie Motion Poster: ఎప్పుడూ లేని విధంగా ఎన్టీఆర్ సరికొత్త యాక్షన్ విజువల్ ట్రీట్

‘బ్రహర్షి విశ్వామిత్ర’లో బాలనటుడిగా తొలిసారి వెండితెర పై మెరిసినప్పుడు, ఎన్టీఆర్ తన నటనా సామర్థ్యాన్ని చూపించాడు. ఆ తరువాత 1997లో వచ్చిన ‘బాల రామాయణం’ చిత్రంలో బాలరాముడిగా తారక్ నటనకు అవార్డుల సైతం క్యూ కట్టాయి. ఆ సినిమా చూసి మరో హీరో ఇండస్ట్రీకి రాబోతున్నాడు అని అప్పటి క్రిటిక్స్ సైతం తారక్ నటనకు నీరాజనాలు పలికారు.

Jr NTR

అలా పౌరాణిక పాత్రలో కూడా తారక్ అద్భుతంగా నటించగలడు అని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత 2001లో ఉషాకిరణ్ మూవీస్ వారి ‘నిన్నుచూడాలని’ చిత్రంతో హీరోగా పరిచయం అయినా విజయం అందుకోలేదు. కానీ తారక్ కు రాజమౌళితో దశ తిరిగింది. ‘స్టూడెంట్ నెం.1’తో హీరోగా నిలబడిపోయాడు ఎన్టీఆర్. అప్పటి నుండి ఎన్టీఆర్ వెనుతిరిగా చూసుకుంది లేదు.

Jr NTR

ఇక ఎమోషన్స్ ను పలికించడంలో ఎన్టీఆర్ లో క్లారిటీతో కూడుకున్న రిథమ్ ఉంటుంది, డైలాగ్స్ చెప్పడంలో స్పష్టత కూడుకున్న పరిపక్వత ఉంటుంది. పైగా సీనియర్ ఎన్టీఆర్ పోలికలే కాదు. ఆయన అభినయం కూడా జూనియర్ ఎన్టీఆర్ కి వచ్చాయి. ఎన్టీఆర్ వారసత్వం పుణికిపుచ్చుకున్నాడని జూనియర్ ఎన్టీఆర్ కి పేరు వచ్చింది గానీ, కొన్ని పాత్రల్లో సీనియర్ ఎన్టీఆర్ కంటే, జూనియర్ ఎన్టీఆర్ ఇంకా అద్భుతంగా నటిస్తాడని నందమూరి అభిమానులే అంగీకరిస్తారు. అందుకే ఇక జూనియర్ సీనియరే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సంవత్సరం ఎన్టీఆర్ కి ఆర్ఆర్ఆర్ రూపంలో అద్భుత విజయం దక్కింది. రానున్న రోజుల్లో కూడా అద్భుతమైన విజయాలు అందుకోవాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్.

Also Read:Rashmika Mandanna: స్పోర్ట్స్ వేర్ లో రష్మిక హాట్ సెల్ఫీ.. ఘాటు ఫోజులు వైరల్
Recommended Videos


Tags