Minister Kandula Durgesh: గత కొంతకాలం నుండి టాలీవుడ్ లో ఏవేవో జరిగిపోతున్నాయి. మూవీ ఆర్టిస్టు అస్సోసియేషన్ ఎక్కడా తలదూర్చడం లేదు. దీంతో దిక్కు తోచని నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) వంటి వారిని కలిసి తమ సమస్యలను చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ ఎలాంటి ఫలితం లేదు. దీంతో సినీ ఇండస్ట్రీ మొత్తం షూటింగ్ ని ఆపేసి బంద్ ని పాటిస్తుంది. ఇదే క్రమంలో నేడు టాలీవుడ్ టాప్ నిర్మాతలంతా కలిసి ఆంధ్ర ప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్(Kandula Durgesh) ని కలిసి చాలాసేపటి వరకు ఇండస్ట్రీ లోని సమస్యల గురించి చర్చించారు. ఇంతకీ సమస్య ఏమిటంటే సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం వరకు పెంచాలి. లేడంటే మేము పని చెయ్యము అంటూ బంద్ పాటిస్తున్నారు. దీంతో షూటింగ్స్ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉంది, ఇది ఓపెన్ సీక్రెట్.
Also Read: రాహుల్ గాంధీ అరెస్ట్.. ఢిల్లీలో ఏం జరుగుతోంది..
రీసెంట్ గా విడుదలైన క్రేజీ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయి. థియేట్రికల్ వ్యాపారం అయితే దారుణంగా ఉంది, నిర్మాతలకు థియేటర్స్ నుండి డబ్బులు రావడం లేదు. ఒకప్పుడు నాన్ థియేట్రికల్ బిజినెస్ అద్భుతంగా ఉండేది. కానీ రెండేళ్ల నుండి అది కూడా పడిపోయింది. ఒకప్పటి లాగా థియేట్రికల్ + నాన్ థియేట్రికల్ బిజినెస్ లు అద్భుతంగా ఉండుంటే సినీ కార్మికుల డిమాండ్స్ కి నిర్మాతలు ఒప్పుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీంతో తమ సమస్యలను చెప్పుకోవడానికి నేడు సినిమాటోగ్రఫీ మిస్టర్ కందుల దుర్గేష్ ని కలిశారు. ఈయన జనసేన పార్టీ ఎమ్మెల్యే అనే విషయం అందరికీ తెలిసిందే. సినీ ఇండస్ట్రీ లోని సమస్యల గురించి చెప్పుకొని, తమకు ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu Naidu) తో కలిసే సమయం ఇవ్వాలని కోరారు. అందుకు కందుల దుర్గేష్ కూడా సానుకూలంగా స్పందించాడు.
కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత సినీ ప్రముఖులందరూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తో భేటీ అయ్యారు. ఆయన్ని భేటీ అయిన రోజునే సీఎం గారిని కలిశారా అని అడిగాడట. కానీ వాళ్ళు కలవలేదని సమాధానం చెప్పారు. ముందు ఆయన్ని కలవండి, నేను అప్పోయింట్మెంట్ ఇప్పిస్తాను అంటూ చెప్పుకొచ్చాడట. నెల రోజుల క్రితం అప్పోయింట్మెంట్ కూడా ఇప్పించాడు. కానీ సినీ నిర్మాతలు వేరే కారణాల చేత కలవలేదు. ఇది పవన్ కళ్యాణ్ కి అసలు నచ్చలేదు. అందుకే ఆయన ఈసారి భేటీ అయ్యేందుకు కూడా ఇష్టం చూపలేదని, దీంతో నిర్మాతలంతా కందుల దుర్గేష్ ని కలిశారని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో చూడాలి. అయితే ఈ సినీ కార్మికుల సమస్య పవన్ కళ్యాణ్ రంగం లోకి దిగితే కానీ పరిష్కారం అయ్యేలా లేదు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.
ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారితో
ముగిసిన తెలుగు సినిమా నిర్మాతలు భేటీ: pic.twitter.com/7qZx1BsqyT— L.VENUGOPAL (@venupro) August 11, 2025