OKTelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాకు చీటింగ్ కేసులో UPలోని మొరదాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వచ్చే నెల 25న హాజరుకావాలని ఆదేశించింది. ఢిల్లీలో ఓ ఈవెంట్ కోసం రూ.37లక్షలు తీసుకున్న సోనాక్షి సిన్హా.. ఈవెంట్‌కు హాజరు కాకపోవడంతో 2019లో ఆమెపై చీటింగ్ కేసు నమోదైంది. అప్పటి నుంచి విచారణకు హాజరుకాకపోవడంతో సోనాక్షికి కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఏమిటంటే.. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ డైరెక్టర్ శంకర్‌తో ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రాజమండ్రి పరిసరాల్లో జరుగుతోంది. చిత్రీకరణ కోసం రాజమండ్రి వెళ్లిన రామ్ చరణ్ అభిమానులతో ఫొటో షూట్‌లో పాల్గొన్నాడు. రామ్‌చరణ్‌కు సురుచి సంస్థ మధురమైన కానుక అందించింది. తాపేశ్వరంలో తయారుచేసిన బాహుబలి కాజాను చెర్రీకి, అలాగే డైరెక్టర్ శంకర్‌కు బహూకరించింది.

ఇక మరో అప్ డేట్ ఏమిటంటే.. సినీ నటుడు మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ ఓ నాయిబ్రాహ్మణుడికి అన్యాయం చేశారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నేడు తిరుపతిలో నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మీడియాలో వస్తున్న నాయి బ్రాహ్మణుడికి మంచు ఫ్యామిలీ అన్యాయం చేసిందని వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని వారు క్లారిటీ ఇచ్చారు.

అంతేకాకుండా నాగ శీనుపై కేసు పెట్టింది మోహన్ బాబు ఇంట్లో పనిచేస్తున్న నిక్కీ అనే మహిళ అని వెల్లడించారు. మొత్తానికి ఈ మధ్య మంచు ఫ్యామిలీ ఫై అనేక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.