OKTelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. lహాస్యబ్రహ్మ బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా రూపొందుతున్న సినిమా గ్లిమ్స్‌ను అతని బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. యస్ ఒరిజినల్స్ బ్యానర్ నుండి ప్రొడక్షన్ నెం 10గా నిర్మిస్తున్న ఈ సినిమాతో సుబ్బు చెరుకూరి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ పోస్టర్‌ను గౌతమ్ క్యారెక్టర్‌లోని పెయిన్‌ను తెలియచేసే విధంగా చిత్ర యూనిట్ డిజైన్ చేసింది.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. సుదీర్ఘ విరామం తర్వాత బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ వెండితెరపై అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. షారుఖ్ నటించిన ‘పఠాన్’ సినిమా టీజర్ ఈరోజు రిలీజ్ కాగా.. చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 25న హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల చేయనున్నారు. యశ్‌రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ అతిథి పాత్ర పోషిస్తుండగా.. దీపికా పదుకొనె, జాన్ అబ్రహం కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read: వైసీపీ నుంచి రాజ్యసభకు అదానీ సతీమణి

ఇంకో అప్ డేట్ విషయానికి వస్టే… క్యాస్టింగ్ కౌచ్‌పై మరో బాలీవుడ్ నటి ఇషా కొప్పికర్ పెదవి విప్పింది. ‘ఓ సినిమాలో హీరోయిన్‌గా సెలెక్ట్ చేశామని నిర్మాత ఫోన్ చేసి హీరోను ఏకాంతంగా కలవాలని చెప్పారు. నేను హీరోకు కాల్ చేస్తే మీరు ఒక్కరే ఒకసారి రండి అని చెప్పాడు. నాకు అప్పుడు విషయం అర్థమైంది. నా టాలెంట్‌ను చూసి ఆఫర్స్ వస్తే చేస్తా అంతే అని తెగేసి చెప్పా’ అని వివరించింది.

ఇషా తెలుగులో చంద్రలేఖ, ప్రేమతో రా, కేశవ సినిమాల్లో నటించింది. హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయిన ఈ బ్యూటీ చివరకు ఇలాంటి కామెంట్ లతో వార్తల్లో నిలిచింది.
Also Read: భీమ్లానాయక్ కలెక్షన్ల వర్షం: ఈ వారంలో అన్ని కోట్లా?
[…] Sudigali Sudheer Marriage: సుడిగాలి సుధీర్.. ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ బుల్లితెరపై ఎవర్ గ్రీన్ కమెడియన్ కం యాంకర్ గా వెలుగొందుతున్నాడు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకొని తెలుగు నాట క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే సుధీర్ పెళ్లి అనేది ఇప్పుడొక మిస్టరీగా మారింది. అతడి పెళ్లి యాంకర్ రష్మీతో అవుతుందా? లేదా మరో అమ్మాయిని చేసుకుంటాడా? అసలు సుధీర్ పెళ్లికి ఎండ్ కార్డ్ ఎప్పుడన్నది ఇప్పటికీ హాట్ టాపిక్ గా మారింది. […]
[…] OK Telugu Movie Time: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. కమల్ సొంత బ్యానర్లో కమలహాసన్ కథానాయకుడిగా ‘విక్రమ్’ సినిమా రూపొందింది. అయితే సూపర్ స్టార్స్ కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్‌ల మోస్ట్ అవైటెడ్ మూవీ విక్రమ్ ట్రైలర్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈనెల 14న ట్రైలర్ లాంచ్ డేట్‌ను రివీల్ చేయనున్నారు. కాగా ఈ సినిమాలో కమల్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నారు. భారీ అంచనాలున్న ఈ మూవీని కమల్ హాసన్,మహేంద్రన్‌లు నిర్మిస్తున్నారు. […]