Top 10 Actors In Tollywood: స్టార్స్ మధ్య నంబర్స్ గేమ్ ఆసక్తికరంగా ఉంటుంది. అందరికీ భారీ మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ నంబర్ వన్ పొజిషన్ ఎవరిదో తెలుసుకోవాలనే ఆత్రుత ఉంటుంది. ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ స్టార్స్ అంటే నలుగురే. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ మధ్య పోటీ ఉండేది. నంబర్ వన్ ఎవరంటే అందరూ చిరంజీవి అనేవారు. ఎన్టీఆర్, మహేష్, పవన్, ప్రభాస్, చరణ్, అల్లు అర్జున్ స్టార్స్ అయ్యే వరకు నంబర్ వన్ పొజిషన్ చిరంజీవిదే. ఈ జనరేషన్ స్టార్స్ లో ఈ పొజిషన్ మారుతూ ఉంటుంది. ఎందుకంటే స్టార్ డమ్ లో మార్కెట్ లెక్కలో నువ్వా నేనా అని పోటీ పడేవారు అరడజను వరకూ ఉన్నారు.
కాబట్టి టాలీవుడ్ లో నెంబర్ వన్ పొజిషన్ ఎవరిదో నిర్ణయించడం కష్టమే. కాగా బాలీవుడ్ మీడియా సంస్థ ఆర్మాక్స్ ప్రతి నెలా దీనిపై సర్వే నిర్వహిస్తోంది. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు అన్ని పరిశ్రమలలోని హీరోల ర్యాంకింగ్స్ పై సర్వే నిర్వహిస్తోంది. ఇండియా వైడ్ ఉన్న సినిమా లవర్స్ అభిప్రాయాల ఆధారంగా ర్యాంకింగ్స్ కేటాయిస్తుంది. సెప్టెంబర్ నెల సర్వే ప్రకారం ఆడియన్స్ టాప్ ర్యాంక్ ప్రభాస్ కి ఇచ్చారు. టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఆయనే అని తేల్చిపారేశారు.
బాహుబలి చిత్రం తర్వాత జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయనకు ఇండియా వైడ్ పాపులారిటీ పెరిగింది. సాహో, రాధే శ్యామ్ నిరాశపరిచినా ప్రభాస్ పాపులారిటీ తగ్గలేదు. అందులోనూ సాహో నార్త్ ఇండియాలో మంచి విజయం సాధించింది. ఇక ప్రభాస్ తర్వాత టాప్ 2 పొజిషన్ ఎన్టీఆర్ కి దక్కింది. ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ సెకండ్ ప్లేస్ రాబట్టారు. కాగా అల్లు అర్జున్ టాప్ 3 ర్యాంక్ దక్కించుకున్నారు. రామ్ చరణ్, మహేష్ 4,5 స్థానాలతో టాప్ ఫైవ్ లో ఉన్నారు.
పవన్ కళ్యాణ్ కి 6వ ర్యాంక్ ఇచ్చారు ఆడియన్స్. నాని, విజయ్ దేవరకొండ, చిరంజీవి, రవితేజ టాప్ 10లో చోటు దక్కించుకున్నారు. సీనియర్ స్టార్స్ లో ఒక్క చిరంజీవి మాత్రమే టాప్ స్టార్స్ లిస్ట్ లో స్థానం పొందారు. ఇక దేశంలోనే అత్యధిక మార్కెట్ కలిగిన హీరోలు టాలీవుడ్ లో ఉన్నారు. ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ లో చేరగా… రూ. 200 కోట్ల వసూళ్ళంటే అవలీలగా సాధించే హీరోలు అరడజను వరకు ఉన్నారు.
Ormax Stars India Loves: Most popular male Telugu film stars (Sep 2022) #OrmaxSIL pic.twitter.com/8UbxzMm8P0
— Ormax Media (@OrmaxMedia) October 13, 2022