
Tollywood: తల్లి అవ్వాలనే కోరిక పెళ్లైన ప్రతి యువతిలోనూ ఉంటుంది. హీరోయిన్లు కూడా అందుకు అతీతులు కారు. అయితే, తల్లి కాకుండానే కొంతమంది హీరోయిన్లను గాసిప్ రాయుళ్లు తల్లిని చేసేస్తుంటారు. ఏ అమ్మాయి అయినా తాను తల్లి అయ్యే సందర్భం వస్తే.. ఎంతో ఆనందపడుతుంది. జీవితంలో అంతకంటే మధుర క్షణాలు స్త్రీ జీవితంలో ఉండవు కాబట్టి.. బిడ్డకు జన్మనిచ్చే రోజు కోసం ఎంతగానో పరితపిస్తోంది.


కానీ తనకు గర్భం అని, త్వరలో తల్లి కాబోతున్నాని పేపర్లో.. సోషల్ మీడియాలో చూసి తెలుసుకుంటే అది దరిద్రంగా ఉంటుంది. ప్రస్తుతం కాజల్ పరిస్థితి ఇలాగే తయారైంది. కాజల్ గర్భవతి అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆమె ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా ఈ పుకార్లు తగ్గడం లేదు. అలాగే మరో హీరోయిన్ విద్యాబాలన్ కూడా తల్లి కాబోతుంది అంటూ తాజాగా రూమర్లు వినిపిస్తున్నాయి.
అయితే, బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇది గాసిప్ రాయుళ్లు చేసిన బాగోతంగానే తెలుస్తోంది. ఇక గతంలో సమంత, ఉపాసన, ఇలియానా, చివరకు పెళ్లి అయి పిల్లలు ఉన్న అనసూయ పై కూడా ఇలాంటి రూమర్లు చాలాసార్లు పుట్టించారు. కానీ ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని వాళ్ళు ఎంత చెప్పినా ఇలాంటి కథనాలు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉన్నాయి.
అనవసరంగా మమ్మల్ని గర్భవతులు చేయకండని వాళ్ళు తలా బాదుకుంటున్నా పుకార్ల వీరులు మాత్రం వినడం లేదు. ఫలానా హీరోయిన్ ప్రెగ్నెంట్ అని వీళ్ళే నిర్దారణ చేసేస్తున్నారు. సరే పెళ్లి అయిన హీరోయిన్లు తల్లి కాబోతున్నారని వార్తలు పుట్టిస్తే.. అవి ఇంట్రెస్టింగ్ రూమర్లే అని సరిపెట్టుకోవచ్చు.

కానీ, పెళ్లి కానీ హీరోయిన్ల పై ఇలాంటి వార్తలు పుట్టిస్తే వాళ్ళను ఏమనాలి ? నిన్న సమంత మూడు యూట్యూబ్ ఛానల్స్ పై పరువు నష్టం దావా వేసినట్లు కేసు వేయలేమో. అసలు ఇలాంటి సున్నిత అంశాలపై ఇష్టం వచ్చినట్లు వార్తలు రాయడం మంచి అనిపించుకోదు.