https://oktelugu.com/

Tollywood Heroines: భయంకర వ్యాధులతో చావు అంచుల వరకు వెళ్లి బయటపడ్డ హీరోయిన్స్ వీళ్లే..

Tollywood Heroines: సినీ ప్రపంచం రంగుల మయం అన్న సంగతి అందరికీ విదితమే. సెలబ్రిటీ స్టేటస్ ఉండటం వల్ల వారిని చూసేందుకుగాను జనాలు ఎగబడుతుంటారు. అయితే, సినీ తారల్లో కొందరు సాధారణ జీవితం గడిపేందుకుగాను ఇష్టపడుతుంటారు. ఇకపోతే వీరికి కూడా రకరకాల సమస్యలుంటాయి. అలా పలు అనారోగ్య సమస్యల బారిన పడి కోలుకున్న వారు చాలా మందే ఉన్నారు. కానీ, మనం తెలుసుకోబోయే ఈ హీరోయిన్స్ మాత్రం భయంకరమైన వ్యాధులతో ఇబ్బందులు పడి చివరికి మనో ధైర్యంతో […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 22, 2022 / 11:24 AM IST
    Follow us on

    Tollywood Heroines: సినీ ప్రపంచం రంగుల మయం అన్న సంగతి అందరికీ విదితమే. సెలబ్రిటీ స్టేటస్ ఉండటం వల్ల వారిని చూసేందుకుగాను జనాలు ఎగబడుతుంటారు. అయితే, సినీ తారల్లో కొందరు సాధారణ జీవితం గడిపేందుకుగాను ఇష్టపడుతుంటారు. ఇకపోతే వీరికి కూడా రకరకాల సమస్యలుంటాయి. అలా పలు అనారోగ్య సమస్యల బారిన పడి కోలుకున్న వారు చాలా మందే ఉన్నారు. కానీ, మనం తెలుసుకోబోయే ఈ హీరోయిన్స్ మాత్రం భయంకరమైన వ్యాధులతో ఇబ్బందులు పడి చివరికి మనో ధైర్యంతో గెలిచారు. ఆ హీరోయిన్స్ ఎవరో తెలుసుకుందాం.

    Sheela Kaur

    బ్యూటిఫుల్ హీరోయిన్ శీలా కౌర్.. గుణశేఖర్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ‘పరుగు’ చిత్రంతో తన పాపులారిటినీ ఇంకా పెంచేసుకున్న ఈ భామ.. ‘సీతా కోక చిలుక, మస్కా, అదుర్స్’ సినిమాల్లో నటించింది. అయితే, ఈ సుందరి ఊపిరితిత్తుల కేన్సర్ బారిన పడి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంది. ఎట్టకేలకు ట్రీట్ మెంట్ ద్వారా క్యూర్ అయింది. మరో స్టార్ హీరోయిన్ మమతా మోహన్ దాస్ కూడా భయంకరమైన వ్యాధి బారిన పడింది. ఈమె 25 ఏళ్లకే బ్లడ్ కేన్సర్ బారిన పడింది. ఈ వ్యాధి బారిన పడిన సమయంలో ఈమెను తన భర్త కూడా వదిలేశాడు. కాగా, మనో ధైర్యంతో ఈమె వ్యాధిని జయించింది.

    Mamta Mohan Das

    మనీషా కోయిరాలా కూడా కెరీర్ పీక్స్ టైంలో ఉన్నపుడు కేన్సర్ బారిన పడింది. అలా ఈమె సినిమాలకు దూరం అయింది. ప్రస్తుతం ఈమె బాగానే ఉన్నప్పటికీ సినిమాలకు దూరంగా ఉంటోంది. ముద్దుగుమ్మ సొనాలి బింద్రే.. మహేశ్ బాబు ‘మురారి’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే, ఈమె ఆ తర్వాత కాలంలో మెటాస్టాటిక్ కేన్సర్ బారిన పడింది.

    Also Read: లాస్ట్ వీక్ హాట్ ఫోటో షూట్ చేసి.. అంతలోనే తల్లి ఎలా అయింది ?

    Manisha Koirala

    ఈ వ్యాధి బారిన పడిన సమయంలో గుర్తు పట్టకుండా అయిన సొనాలి బింద్రే..వ్యాధిపైన తీవ్రమైన పోరాటం చేసి చివరికి నెగ్గింది. సీనియర్ హీరోయిన్ గౌతమి కూడా బ్రెస్ట్ కేన్సర్ బారిన పడింది. గౌతమి తల్లి కేన్సర్ బారిన పడి కన్నుమూసింది. అయితే, ఈమె మాత్రం కేన్సర్‌తో పోరాడి.. ఆ పోరాటంలో విజయం సాధించింది. ఇకపోతే కేన్సర్ తో బాధపడుతున్న వారి కోసం ఫౌండేషన్ స్టార్ట్ చేసిన గౌతమి.. వారిలో ధైర్యం నింపేందుకుగాను తన వంతు ప్రయత్నం చేస్తోంది.

    Sonali Bendre

    Also Read: దీపికా మరీ ఇంత పచ్చిగా నటించింది ఏమిటి ?

    Tags