Tollywood Heroines in Politics: హీరోయిన్స్ గా వెండితెరను ఏలిన అందాల తారలు రాజకీయాల్లో కూడా రాణించారు. మహిళా శక్తి తలచుకుంటే మగాళ్లకు ధీటుగా పాలించగలమని నిరూపించారు. తమిళ రాష్ట్రాన్ని అప్రతిహతంగా పాలించిన దివంగత జయలలిత అనేక మంది హీరోయిన్స్ రాజకీయాల్లోకి రావడానికి స్ఫూర్తిని ఇచ్చారు. మరి నేతలుగా చక్రం తిప్పిన టాలీవుడ్ హీరోయిన్స్ ఎవరో చూద్దాం..
సహజనటి జయసుధ 2009లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆమె అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి గెలిచి ఎం ఎల్ ఏ అయ్యారు. అయితే 2014 తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం జయసుధ అంత క్రియాశీలకంగా లేరు.
జయప్రద పొలిటికల్ కెరీర్ తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైంది. 1994లో ఆమె ఆ పార్టీలో చేరారు. 1996లో టీడీపీ పార్టీ తరపున రాజ్యసభ మెంబర్ అయ్యారు. అనంతరం పార్టీ అధినేత చంద్రబాబుతో విభేదాల కారణంగా టీడీపీ నుండి బయటకు వచ్చారు. సమాజ్ వాదీ పార్టీలో చేరిన జయప్రద 2004 పార్లమెంట్ ఎలక్షన్స్ లో యూపీ నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. రెండు సార్లు ఎంపీ అయిన జయప్రద 2019లో బీజేపీ పార్టీలో చేరారు.
Also Read: ఏపీ బీజేపీ నేతల మాటలకు విలువ లేదా?
90లలో గ్లామరస్ హీరోయిన్ గా తెలుగు తెరను ఏలిన నగ్మా 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో మీరట్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఏకంగా ఆమె డిపాజిట్స్ కోల్పోయారు. 2015లో నగ్మాను ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ పార్టీ విభాగానికి జనరల్ సెక్రటరీ గా నియమించారు.
తెలుగులో అడపదడపా సినిమాలు చేసిన నవనీత్ కౌర్ పాలిటిక్స్ లో సక్సెస్ అయ్యారు. 2014 ఎన్నికల్లో ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరపున మహారాష్ట్ర నుండి పోటీ చేశారు. అయితే ఆమె ఓటమి చవిచూశారు. 2019లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా అమరావతి పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు.
వైసీపీ ఫైర్ బ్రాండ్ గా పేరున్న రోజా పొలిటికల్ కెరీర్ టీడీపీ పార్టీలో మొదలైంది. 1999లో ఆమె టీడీపీలో చేరారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైఎస్ జగన్ స్థాపించిన వైసీపీ పార్టీలో చేరారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుండి వరుసగా ఎన్నికయ్యారు. రోజా మంత్రి పదవిని ఆశిస్తున్నారు.
సీనియర్ హీరోయిన్ సుమలత 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ లో కర్ణాటక నుండి పోటీ చేసి గెలుపొందారు. కర్ణాటక మాండ్య నియోజకవర్గం నుండి ఆమె ఎంపీగా గెలుపొందారు.
జయలలిత ఇండియన్ పాలిటిక్స్ లో సక్సెస్ ఫుల్ మహిళా లీడర్ గా ఉన్నారు. ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకే పార్టీలో 1984లో చేరిన జయలలిత అంచెలంచెలుగా ఎదిగారు. 1991లో తమిళనాడు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన జయలలిత పలుమార్లు ఆ పీఠం అధిరోహించారు. 2016లో ముఖ్యమంత్రి హోదాలోనే మరణించారు.
పెళ్లి పుస్తకం ఫేమ్ దివ్య వాణి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. సీనియర్ నటి వాణిశ్రీ సైతం రాజకీయాల్లో చేరి విరమించుకున్నారు.
Also Read: క్రేజీ సినిమాలో మాజీ రొమాంటిక్ హీరో
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read MoreWeb Title: Tollywood heroines who ruled politics
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com