https://oktelugu.com/

Tollywood Heroine : అసలేమైంది.. ఆస్పత్రి బెడ్ పై టాలీవుడ్ హీరోయిన్.. వైరల్ అవుతున్న ఫొటో

అనారోగ్యంతో ఆసుపత్రిలో ఆసుపత్రిలో చేరారా? మరెదైన కారణం ఉందా? అని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ విషయంపై సునయనే క్లారిటీ ఇవ్వాలి అని కొందరు అంటున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : October 21, 2023 / 12:01 PM IST
    Follow us on

    Tollywood Heroine : సినిమాల్లో ఎంతో అందంగా కనిపించే హీరోయిన్లకు ఫ్యాన్స్ ఎక్కువే ఉంటారు. దీంతో వారి రియల్ లైఫ్ ను కూడా ఫాలో అవుతూ ఉంటారు. వారు ఏం చేస్తుంటారు? ఎలా ఉన్నారు? అనే ఆసక్తి విషయాలు తెలుసుకుంటారు. ఫ్యాన్స్ ను అలరించేందుకు కొందరు హీరోయిన్లు సోషల్ మీడియా వేదికగా తమ పర్సనల్ విషయాలను షేర్ చేస్తూ అలరిస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ ఆసుపత్రి బెడ్ పై కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది.చేతికి సెలైన్ బాటిల్ పెట్టుకొని కనిపించింది. దీంతో ఆమెకు ఏమైంది? అని పోస్టులు పెడుతున్నాడు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఈ ఫొటోను ఎందుకు రిలీజ్ చేసింది? అనే వివరాల్లోకి వెళితే..

    టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఈ మధ్య కొత్త హీరోయిన్ల హవా పెరిగిపోతుంది. ఈ క్రమంలో ‘కుమారి వర్సెస్ కుమారి’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది సునయన. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె మొదటి సినిమాతో పేరు తెచ్చుకుంది. ఆ తరువాత సంతింగ్ స్పెషల్, టెన్త్ క్లాస్, బెస్ట్ ఫ్రెండ్ అనే తదితర సినిమాల్లో నటించింది. తెలుగులో నటించిన తరువాత ఆమెకు తమిళం, కన్నడం నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి. అక్కడా పలు సినిమాల్లో నటించింది.

    ఎన్నో సినిమాల్లో నటంచిన సునయన స్టార్ ఇమేజ్ రాలేకపోయింది. అందం, అభినయంతో ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ ఉత్తమనటిగా ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకుంది. అలాగే తమిళ బిగ్ బాస్ సీజన్ 4లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత కొన్నాళ్లకు శ్రీవిష్ణు హీరోగా వచ్చిన ‘రాజరాజచోర’ అనే సినిమాలో నటించిన తరువాత అమ్మడుకు ఫ్యాన్స్ పెరిగారు. దీంతో ఆమె సోషల్ మీడియా ఖాతాను పాలో అవుతున్నారు.

    తాజాగా తన ఇన్ స్ట్రాగ్రామ్ ఖాతాలో ఆసుపత్రిలో బెడ్ పై పడుకొని చేతికి సెలైన్ బాటిల్ పెట్టుకున్న ఫొటో ఒకటి రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా ‘నాకు కొంత సమయం ఇవ్వండి’ అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ పిక్ సోషల్ మీడియాలోవైరల్ కావడంతో తనకు ఏమైంది? అంటూ కామెంట్ల వరదపారిస్తున్నారు.దీంతో ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో ఆసుపత్రిలో చేరారా? మరెదైన కారణం ఉందా? అని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ విషయంపై సునయనే క్లారిటీ ఇవ్వాలి అని కొందరు అంటున్నారు.