Tollywood Heroes And Directors AI photos: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరు కలిసి కనిపిస్తే వాళ్ళ అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. బయట మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని కొట్టుకు చచ్చే అభిమానులు ఒకే వేదిక పైన హీరోలు కనిపిస్తే మాత్రం సంతోషపడతారు. ఇక మల్టీ స్టారర్ సినిమాలు వచ్చినట్టయితే మాత్రం ఇద్దరు హీరోల అభిమానులు సినిమాను చూడడానికి వస్తారు. వాళ్ల అభిమాన హీరోతో పాటు మరొక హీరోను కూడా ఆదరిస్తారు. ఒకరకంగా మల్టీ స్టారర్ సినిమాల వల్ల ఇండస్ట్రీలో హీరోల మధ్య ఉన్న గ్యాప్, అభిమానుల మధ్య తలెత్తే విమర్శలు తొలగిపోతాయనే ఉద్దేశ్యంతోనే మల్టీ స్టారర్ సినిమాలకు దర్శకులు సన్నాహాలు చేస్తూ ఉంటారు… ఇక ఇలాంటి క్రమంలోనే మన స్టార్ హీరోలందరు కలిసి ఒకే దగ్గర టీ తాగుతున్న వీడియో గాని, ఫోటో గాని మనం ఎప్పుడు చూడలేదు. దాంతో ఇప్పుడు ఏఐ టెక్నాలజీ తో చేసిన ఒక ఫోటో బయటికి రావడంతో మన స్టార్ హీరోలందరు కలిసి టీ తాగినట్టుగా ఆ ఫోటో లో ఉండటం తో అది సోషల్ మీడియాలో విపరీతం చక్కర్లు కొడుతోంది.
ఇక ఫోటో చూసిన ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు ఇలాగే కలిసిమెలిసి ఉంటే బాగుంటుంది. ఇండస్ట్రీ కూడా సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతుందని కొనియాడుతున్నారు. హీరోలతో పాటు దర్శకులు సైతం టీ ని తాగుతూ ముచ్చట్లు పెట్టుకుంటున్నట్టుగా ఒక ఫోటో బయటికి వచ్చింది. ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు దర్శకులు ఏదైతే చేస్తారో బయట జనాలు కూడా అదే ఫాలో అవుతూ ఉంటారు…
ఒకరకంగా సామాన్య జనాలకు స్క్రీన్ మీద కనిపించే హీరోలు తెరవెనక మ్యాజిక్ చేసే దర్శకులు రోల్ మోడల్స్ గా కనిపిస్తారు. అందువల్లే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కొన్ని విషయాల్లో ముందుకు సాగాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు… ఇక ఎప్పటికైనా మన హీరోలు దర్శకులు అందరు కలిసి మెలిసి ఉంటే చూడాలని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మొత్తానికైతే తెలుగు సినిమా హీరోల మధ్య ఒక మంచి బాండింగ్ ఉంది. ఒకరి ఫంక్షన్స్ కి మరొకరు వెళతారు. అలాగే ఒకరి సినిమాలను మరొకరి ఎంకరేజ్ చేసుకునేంత మంచితనం ఉంది. కాబట్టే వాళ్ళందరు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు వాళ్ళ మనుగడను కొనసాగిస్తున్నారనే చెప్పాలి…