https://oktelugu.com/

Actor Nandu : నాకేమాత్రం సంబంధం లేదు.. స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకున్న టాలీవుడ్ హీరో

అయితే ఆ తర్వాత నందుకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని కూడా వార్తలు వచ్చాయి. ఇక ఆయన దీని గురించి మాట్లాడే బాధ పడ్డారు అని టాక్.

Written By:
  • NARESH
  • , Updated On : February 12, 2024 / 02:37 PM IST
    Follow us on

    Actor Nandu : యాక్టర్ నందు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సెకండ్ హీరోగా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మరోవైపు క్రికెట్ మ్యాచ్ లకు సంబంధించిన ప్రోగ్రామ్స్ కు కూడా యాంకరింగ్ చేస్తూనే ఇటీవల డ్యాన్స్ షో డీ లోకి వచ్చి యాంకరింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం నందు కెరీర్ లో సినిమాలు, సిరీస్ లు, యాంకరింగ్ అంటూ చాలా బిజీగా ఉన్నారు. ఇక నందు భార్య సింగర్ గీతా మాధురి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె మంచి సింగర్.

    రీసెంట్ గా ఢీ షో కొత్త ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఇది వాలెంటైన్ వీక్ కావడంతో షోలో కూడా వాలెంటైన్స్ స్పెషల్ ఎపిసోడ్ చేశారు. అయితే ఈ ఎపిసోడ్ లో హైపర్ ఆది, గీతామాధురిని ఉద్దేశించి నందుతో మీ ఇద్దరి మధ్య జరిగిన ఏదైనా ఒక ఎమోషనల్ మూమెంట్ గురించి చెప్పమని అడుగుతారు ఆది. దానికి సమాధానం ఇస్తూనే నందు చాలా ఎమోషనల్ అయ్యారు.

    నా మీద ఒక రూమర్ వచ్చింది. నాకు ఎటువంటి సంబంధం లేని ఒక విషయంలో నా పేరు లాగి న్యూస్ లో బాగా రిపీట్ చేశారు. 12 రోజుల పాటు నన్ను వార్తల్లో నెగిటివ్ గా హైలెట్ చేస్తూ చూపించారు. కానీ తర్వాత దీనికి నాతో సంబంధం లేదని
    తెలిసాక సింపుల్ గా స్క్రోలింగ్ లో వేశారు. దానివల్ల నేను చాలా బాధ పడ్డాను అంటూ స్టేజీపైనే చాలా ఎమోషనల్ అయ్యారు నందు. ఇక దీని వల్ల నందు, గీతా మాధురి మధ్య ఏం జరిగింది? నందు ఏం చెప్పారో అని తెలియాలంటే ఏపిసోడ్ చూడాల్సిందే.

    అయితే నందు మాట్లాడింది కేవలం డ్రగ్స్ మనీలాండరింగ్ కేసు ఇష్యూ గురించి అని సమాచారం. గతంలో ఓ డ్రగ్స్, మనీ లాండరింగ్ కేసులో నందు పేరు బాగా వినిపించింది. అయితే ఆ తర్వాత నందుకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని కూడా వార్తలు వచ్చాయి. ఇక ఆయన దీని గురించి మాట్లాడే బాధ పడ్డారు అని టాక్.