Homeఎంటర్టైన్మెంట్Evergreen Telugu Hits: తెలుగు ప్రత్యేక క్లాసిక్ చిత్రాలు ఇవే !

Evergreen Telugu Hits: తెలుగు ప్రత్యేక క్లాసిక్ చిత్రాలు ఇవే !

Evergreen Telugu Hits

తెలుగు సినీ లోకంలో ఎన్నో గొప్ప బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు క్లాసిక్ చిత్రాలుగా నిలిచిపోయాయి. ఆ పాత సినిమాలే నేటి తరం దర్శకులకు పాఠాలుగానూ మారాయి. మరి అలాంటి ఆనాటి సినిమాల ఏమిటో చూద్దాం.

మాయా బజార్ :

మహా దర్శకుడు కె.వి.రెడ్డి గారి దర్శకత్వ ప్రతిభకు గొప్ప నిదర్శనంగా నిలిచింది ఈ అపురూప చిత్రం. భారతీయ సినిమాల్లోనే అత్యుత్తమమైన సినిమాగా ఈ చిత్రం ఎంపికైంది. ముఖ్యంగా పింగళి నాగేంద్రరావు గారి కలం నుండి జాలువారిన చిత్ర విచిత్రమైన తెలుగు పదాలు మన భాష గొప్పతనాన్ని, తెలుగు మాధుర్యాన్ని చాటి చెప్పింది.

మూగ మనసులు :

దర్శక దిగ్గజం ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో పునర్జన్మల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం గొప్పతనం గురించి ఎంత చెప్పినా అవుతుంది. రచయిత ముళ్లపూడి వెంకటరమణ స్క్రిప్ట్ వర్క్ ఈ సినిమాకి గొప్ప ప్లస్ అయింది. సాంఘిక చిత్రాలలోనే ఈ చిత్రం ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలవడం విశేషం.

గూఢాచారి 116 :

తెలుగు సినిమాలలో తొలిసారిగా స్పై థ్రిల్లర్ ఇది. కృష్ణ, శోభన్ బాబు కథానాయకులుగా నటించిన ఈ సినిమా ఇప్పటికీ క్రేజీ సినిమాగానే నిలిచి ఉండటం నిజంగా గొప్ప విషయమే. ఎం. మల్లిఖార్జునరావు దర్శకత్వం వహించారు.

బంగారు పాప :

పేరులోనే బంగారం ఉన్నట్లు… ఈ సినిమా కూడా బంగారం అనిపించుకుంది. ఈ సినిమాలో ఎస్వీ రంగారావు, జగ్గయ్య ప్రధాన పాత్రలు పోషించారు. బి.ఎన్.రెడ్డి గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలతో పాటు లెక్కలేనన్ని అవార్డులు కూడా దక్కాయి.

మరో ప్రపంచం :

ఆదుర్తి, అక్కినేని సంయుక్తంగా నిర్మించిన చిత్రం మరో ప్రపంచం. మన దేశ విద్యా వ్యవస్థలో రావాల్సిన మార్పుల గురించి, భవిష్యత్తు తరాలను అందించాల్సిన ప్రేరణను గురించి ఈ సినిమా తెలియజేస్తుంది.


అంతులేని కథ :

అంతులేని కథ 1976 లో కె. బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. మధ్య తరగతి కుటుంబంలో చాలీ చాలని సంపాదనతో కుటుంబ కష్టాలను తీర్చే ఓ ఆత్మస్థైర్యం కలిగిన అమ్మాయి కథ ఇది.


సుడిగుండాలు :

అక్కినేని, ఆదుర్తి కలిసి నిర్మించిన తెలుగు చలన చిత్రం ఇది. డ్రగ్స్, విచ్చలవిడి సెక్స్, క్లబ్ కల్చర్ లాంటి పాశ్చాత్య అలవాట్లకు అలవాటు పడిన యువత ఎలా నేర మార్గం వైపు పయనిస్తున్నారో తెలిపే చిత్రం ఇది. ఇవన్నీ కూడా ఏదో ఒక అంశానికి సంబంధించిన ప్రత్యేకతలు ఉన్న సినిమాలే. ఇప్పటికీ క్లాసిక్ చిత్రాలుగా నిలిచిన సినిమాలే.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular