Allu Sirish: ఏళ్ల తరబడి విజయం కోసం ఎదురు చూసి విసిగిపోయిన అల్లు శిరీష్ ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని ఫిక్స్ అయినట్లున్నాడు. దీని కోసం మనోడు తెగించి కొన్ని సాహసాలు చేశాడు. ఊర్వశివో రాక్షసివో చిత్రంతో కొత్త రికార్డు సెట్ చేశాడు. ఇంతవరకు ఏ టాలీవుడ్ హీరో పెట్టనన్ని లిప్ లాక్ కిస్సులు ఒక్క సినిమాలోనే అల్లు శిరీష్ అను ఇమ్మానియేల్ కి పెట్టాడు. ఊర్వశివో రాక్షసివో చిత్రంలో అల్లు శిరీష్-అను ఇమ్మానియేల్ మధ్య ఏకంగా 12కి పైగా లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయి. తెలుగు సినిమాల్లో ఒకటి రెండు లిప్ లాక్ సన్నివేశాలుంటేనే గొప్పగా చెప్పుకుంటారు. అలాంటిది శిరీష్ బీభత్సం చేశాడు.

టాలీవుడ్ హీరోలు బోల్డ్ సన్నివేశాల్లో నటించడానికి భయపడతారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కడ దూరమైపోతారో అని ఆందోళన చెందుతారు. శిరీష్ ఆ భయాలన్నీ పక్కన పెట్టేశాడు. చాలా సౌకర్యంగా ఆ సీన్స్ లో నటించాడు. ముఖ్యంగా అను ఇమ్మానియేల్ ని మెచ్చుకోవాలి. అల్లు శిరీష్ తో అలాంటి సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు అను కొంచెం కూడా ఇబ్బందిగా ఫీలైన భావన కలగలేదు. ఇద్దరూ మమేకమై నటించారు. ఒకరకంగా చెప్పాలంటే జీవించారు.
అయితే ఈ సన్నివేశాల పట్ల ప్రేక్షకులకు వల్గర్ ఫీలింగ్ కలగకపోవడం విశేషం. ఆడియన్స్ కథలో భాగంగా తీసుకున్నారు. ఊర్వశివో రాక్షసివో సినిమా థియేటర్స్ యూత్ ఆడియన్స్ తో నిండిపోగా వారు పిచ్చగా ఎంజాయ్ చేశారు. ఇక టాలీవుడ్ కి శిరీష్ రూపంలో ఇమ్రాన్ హష్మీ దొరికాడు అంటున్నారు. ఆ విషయంలో అర్జున్ రెడ్డిని మించిపోయాడన్న అభిప్రాయం వెల్లడిస్తున్నారు. అల్లు శిరీష్ లోని బోల్డ్ అండ్ రొమాంటిక్ యాంగిల్ ప్రేక్షకులకు కొత్తగా తోచింది.

ముద్దుల గోల ఎలా ఉన్నా ఊర్వశివో రాక్షసివో మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆడియన్స్, క్రిటిక్స్ సినిమా బాగుందన్న అభిప్రాయం వెల్లడిస్తున్నారు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ కామెడీ, రొమాంటిక్ సన్నివేశాలతో సినిమాను దర్శకుడు ఎంటర్టైనింగ్ నడిపాడు అంటున్నారు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకు ప్లస్ అయ్యింది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఊర్వశివో రాక్షసివో తెరకెక్కింది. దర్శకుడు రాకేష్ శశి తెరకెక్కించారు. అచ్చు సంగీతం అందించారు.