https://oktelugu.com/

Hero Surya: తమిళ్ స్టార్ హీరో సూర్య ని పట్టించుకోని మన డైరెక్టర్లు … ఎందుకంటే..?

సూర్యని తెలుగు దర్శకులు ఎందుకు పట్టించుకోవట్లేదు అనే న్యూస్ ఒకటి ఇప్పుడు తెగ వైరలవుతుంది. ఎందుకంటే అ ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్ సూర్యతో ఒక సినిమా చేస్తున్నాను అనే అనౌన్స్ మెంట్ చేశాడు కానీ ఆ తర్వాత ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు.

Written By:
  • Gopi
  • , Updated On : January 4, 2024 / 04:28 PM IST

    Hero Surya

    Follow us on

    Hero Surya: తమిళ్ సూపర్ స్టార్ అయిన సూర్య వరుసగా మంచి సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే సూర్య నటించిన చాలా సినిమాలు తెలుగులో కూడా డబ్ అయి ఆయనకి ఇక్కడ కూడా మంచి గుర్తింపునైతే తీసుకు వచ్చి పెట్టాయి. ఇక దాంతో పాటుగా తెలుగు లో కూడా ఆయనకు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడం తో ఆయన మార్కెట్ కూడా భారీ గా పెరగడం లో ఆ సినిమాలు చాలా వరకు హెల్ప్ అయ్యాయి.

    అయితే సూర్యని తెలుగు దర్శకులు ఎందుకు పట్టించుకోవట్లేదు అనే న్యూస్ ఒకటి ఇప్పుడు తెగ వైరలవుతుంది. ఎందుకంటే అ ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్ సూర్యతో ఒక సినిమా చేస్తున్నాను అనే అనౌన్స్ మెంట్ చేశాడు కానీ ఆ తర్వాత ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు ఇంకా తర్వాత రాజమౌళి కూడా మగధీర సినిమా తర్వాత సూర్యతో ఒక సినిమా చేయాల్సింది కానీ అది అప్పటి నుంచి ఇప్పటివరకు అలానే ఉండిపోయింది. సూర్యతో ఒక సినిమా కూడా చేయలేదు. ఇక అదే విధంగా నాన్నకు ప్రేమతో సినిమా తర్వాత సుకుమార్ కూడా సూర్యతో ఒక సినిమా చేయాల్సింది ఒక ఆయన కూడా సూర్యతో చేయాల్సిన సినిమా మీద ఎలాంటి స్పందన ఇవ్వట్లేదు

    ఇక ఇలాంటి క్రమంలో సూర్య ని ఎందుకు మన తెలుగు స్టార్ డైరెక్టర్లు పట్టించుకోవట్లేదు అంటూ పలువురు ఆసక్తికరమైన కామెంట్లు కూడా చేస్తున్నారు. నిజానికి సూర్య టాలెంట్ ఉన్న నటుడు ఏ క్యారెక్టర్ అయిన తను ఈజీగా చేయగలడు అయినప్పటికీ ఆయనతో సినిమాలు చేస్తామని చెప్పి ఎందుకు క్యాన్సల్ చేస్తున్నారు అంటూ సినీ పెద్దలు సైతం ఈ విషయం మీద తీవ్రంగా స్పందిస్తున్నారు.

    ఇక ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్లు సైతం ఆయనతో సినిమా చేయడానికి ఉత్సాహన్ని చూపిస్తున్నారు. కానీ ఎవరు కూడా కార్యరూపం దాల్చి ఆయనతో తెలుగులో స్ట్రైట్ గా సినిమా చేయడానికి ముందుకు కదలడం లేదు మరి ఇది ఎక్కడ లోపం జరుగుతుంది అనేది క్లారిటీగా తెలియదు కానీ మొత్తానికి అయితే స్టార్ట్ డైరెక్టర్ లందరూ సూర్య ని పట్టించుకోవడం మానేశారు అనే న్యూస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది…