Tollywood Directors: ఒక సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలుపడానికి దర్శకులు తీవ్రమైన ప్రయత్నం చేస్తారు. సినిమాలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటే బాగుంటుంది. ఎలాంటి సీన్స్ తో ప్రేక్షకులను థియేటర్ కి రప్పించవచ్చు అని ఒకటికి పది సార్లు ఆలోచిస్తూ సినిమాని ఆ దిశగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది దర్శకులు రిపిటెడ్ గా తమ సినిమాలో కొన్ని సీన్స్ ని వాడుతూ ఉంటారు. లేదంటే కొన్ని మూమెంట్స్ ని సైతం తమ సినిమాలో రిపీట్ చేస్తూ ఉంటారు… మరి కొంతమంది దర్శకులు మాత్రం కొంతమంది నటులను తమ సినిమాలో పెడుతూ వాళ్ల వల్ల సక్సెసులు వస్తున్నాయని నమ్ముతుంటారు… పూరి జగన్నాథ్ సినిమాలో హీరో అనాధగా ఉండడం అనేది రెగ్యూలర్ గా జరుగుతూనే ఉంటుంది. హీరోకి ఎలాంటి ఫాదర్, మదర్ లేకపోతే తను ఇండివిడ్యూయల్ గా ఉంటే తనకి ఏదైనా చేయగలిగే కెపాసిటి ఉంటుందని పూరి జగన్నాథ్ నమ్ముతాడు. అందుకే అతన్ని సోలోగా పెట్టి తనకొక హీరోయిన్ ని అటాచ్ చేసే ప్రయత్నం చేస్తాడు…
రాజమౌళి సినిమాలో విలన్ ని స్ట్రాంగ్ గా చూపిస్తుంటాడు. ఎందుకంటే అంత పెద్ద విలన్ ను ఢీ కొట్టాలి అంటే హీరో స్ట్రాంగ్ గా మారాల్సి ఉంటుంది. కాబట్టి ఆయన అలాంటి విలనిజాన్ని ఎలివేట్ చేస్తూ ఉంటాడు…
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చే ప్రతి సినిమాలో డైలాగులు అద్భుతంగా ఉంటాయి. అలాగే ఫాదర్ మదర్ ఎమోషనల్ సన్నివేశాలను ఆయన చాలా బాగా రాసుకుంటాడు…వాటి మీద సినిమా మొత్తాన్ని నడిపిస్తుంటాడు…
సుకుమార్ సినిమాల్లో ఐక్యూ లెవెల్ పీక్స్ లో ఉంటుంది. తన హీరో ఏదైనా సరే ఇట్టే పసిగట్టేసే టాలెంటెడ్ గా ఉంటాడు…
సందీప్ వంగ సినిమాల్లో బోల్డ్ సీన్స్ రెగ్యూలర్ గా కనిపిస్తుంటాయి…ఆయన వాటిమీదనే మంచి ఎమోషనల్ సీన్స్ రాస్తుంటాడు…
ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చే సినిమాల్లో బొగ్గు, మసి, లో లైటింగ్ సీన్స్, ఎలివేషన్స్ తో కూడిన సన్నివేశాలు ఉంటాయి…
మన దర్శకులందరు ఇలా తమ స్ట్రాంగ్ జోన్ ని నమ్ముకొని సినిమాలు ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అందువల్లే వీళ్ళందరికి సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉందనే చెప్పాలి…ఇక మీదట వీళ్ళ నుంచే వచ్చే సినిమాలు మరింత సక్సెస్ అవ్వాలని కోరుకుందాం…