https://oktelugu.com/

Tollywood : దారుణమైన సినిమాలతో నిరాశ పరిచిన దర్శకులు !

Tollywood: సినిమా హిట్ అవ్వాలి అంటే.. దర్శకుడు పైనే ఆధార పడి ఉంటుంది. అందుకే.. సినిమాకి దర్శకుడే మెయిన్. సినిమాకి దర్శకుడే కర్త కర్మ క్రియ. అయితే, కొందరు దర్శకుల్లో గొప్ప టాలెంట్ ఉంటుంది. పైగా ఒకప్పుడు సక్సెస్ లు కూడా అందుకుంటారు. కానీ ఆ తర్వాత కాలంలో తెలియకుండానే తమ పేరును, తమ దర్శకత్వ ప్రతిభను కోల్పోతూ ఉంటారు. చివరకు చెత్త సినిమాలు చేసి అనేక అపవాదులు మూటకట్టుకుంటారు. తెలుగులో కూడా కొందరు టాలెంట్ దర్శకులు […]

Written By:
  • admin
  • , Updated On : September 8, 2021 / 05:35 PM IST
    Follow us on

    Tollywood: సినిమా హిట్ అవ్వాలి అంటే.. దర్శకుడు పైనే ఆధార పడి ఉంటుంది. అందుకే.. సినిమాకి దర్శకుడే మెయిన్. సినిమాకి దర్శకుడే కర్త కర్మ క్రియ. అయితే, కొందరు దర్శకుల్లో గొప్ప టాలెంట్ ఉంటుంది. పైగా ఒకప్పుడు సక్సెస్ లు కూడా అందుకుంటారు. కానీ ఆ తర్వాత కాలంలో తెలియకుండానే తమ పేరును, తమ దర్శకత్వ ప్రతిభను కోల్పోతూ ఉంటారు.

    చివరకు చెత్త సినిమాలు చేసి అనేక అపవాదులు మూటకట్టుకుంటారు. తెలుగులో కూడా కొందరు టాలెంట్ దర్శకులు కొన్ని దారుణమైన సినిమాలు చేశారు. వారెవరో చూద్దాం.

    దర్శకుడు తేజ

    దర్శకశమంతకమణి తేజ కెరీర్ లో నీకు నాకు డాష్ డాష్ అంటూ కొన్ని చెత్త సినిమాలు తీశాడు. ఆ మాటకొస్తే.. ఆయన సినిమాలు అన్నీ (నువ్వు నేను, జయం, ధైర్యం, వగైరా) ఇలా అన్ని సినిమాలదీ ఒకే కథ. ఇక పాటలు కూడా ఒక సినిమాలోవి మరో సినిమాలోకి వాడేసుకోవచ్చు అన్నట్లుంటాయి.

    మెహెర్ రమేశ్ :

    మంచి టేకింగ్ చేస్తాడు అని పేరు ఉంది. కానీ కాపీలకు అత్యుత్తమ నిదర్శన ఈయన తీసిన కళాఖండాలు. పైగా భారీ బడ్జెట్ లు పెట్టించి నిర్మాతలకు భారీ నష్టాలూ తీసుకొస్తాడు అనే పేరు కూడా మెహర్ రమేశ్ పై ఎక్కువగా ఉంది.

    వీవీ వినాయక్ (2011 నుండి)

    ఎందుకో తెలియదు వినాయక్ తన వైభోగాన్ని కోల్పోయాడు. అఖిల్, ఇంటెలిజెంట్ అంటూ భారీ డిజాస్టర్స్ తీశాడు.

    విఎన్ ఆదిత్య

    పాత పచ్చడి బూజు పట్టకుండా ఉంటే అప్పుడప్పుడు కాసింతైనా తినవచ్చు. ఈయన సినిమాలు మొదటి నుంచి బూజు పట్టేసిన పాత పచ్చడిలా అనిపించేవి. మొదట్లో పాటలైనా బాగుండేవి, తరువాత అదీ లేదు.

    గుణశేఖర్

    సైనికుడు చూశాక అసలు ఒక్కడు తీసిన ఈయనేనా అనిపించేది. వరుడు, నిప్పు చూశాక గుణశేఖర్ ఫేడ్ అవుట్ అయిపోయాడు అనిపించింది. కానీ రుద్రమదేవితో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.

    వీరు పోట్ల

    బిందాస్, రగడ సినిమాలు ఎలా ఉన్నా కామెడీ చాలా బాగుంది. కానీ తర్వాత ఆ మాత్రం కనీస వినోదమూ లేకుండా నాసిరకం సినిమాలతో బాగా నిరాశపరిచాడు వీరు పోట్ల.

    లారెన్స్ :

    లారెన్స్ తీసిన కొన్ని తమిళ చిత్రాల్లో నిలువెత్తు మానవీకరణ కోణాలు ఉంటాయి. కానీ అలాంటి లారెన్స్ కూడా కొన్ని చెత్త సినిమాలు తీసి నిరాశ పరిచాడు. ఇలా చాలా మంది దర్శకులే ఉన్నారు.