Director Trivikram: ఒక సినిమా హీరోయిన్ ఎంపిక బాధ్యత డైరెక్టర్ దే. మంచి హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయం అయిందంటే ఆ క్రెడిట్ అంతా ఆయనకే వెళ్తుంది. ఎంపిక చేసిన హీరోయిన్ గనుక సక్సస్ ఫుల్ లైఫ్ ను కొనసాగిస్తే ఆ నటి తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్ ను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది. ఆ డైరెక్టర్ తనకు చేసిన సాయం గురించి పలు సందర్భాల్లోనూ చెబుతూ ఉంటుంది. అయితే లేటేస్ట్ గా పాపులారిటీ తెచ్చుకుంటున్న సంయుక్త మీనన్ డైరెక్టర్ త్రివిక్రమ్ పై షాకయ్యే కామెంట్స్ చేశారు. ఎందుకంటే ఆమెను తెలుగు సినిమాకు పరిచయం చేసింది ఆయనే కాబట్టి. ఇంతకీ సంయుక్త మాటల మాంత్రికుడిపై ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? అసలు సంయుక్త మీన్ లో ఏం చూసి హీరోయిన్ గా ఎంపిక చేశారు?
త్రివిక్రమ్, సంయుక్త మీనన్ ల మధ్య ఇటీవల సోషల్ మీడియాలో అడ్డూ అదుపు లేకుండా వార్తలు వస్తున్నాయి. వీరి మధ్య ఏదో ఉందని, ఏమో జరుగుతుందని రకరకాల పోస్టులు పెడుతున్నారు. సినీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్లకు ఇలాంటి ఇబ్బందులు కొత్తేమీ కాదు. కానీ వీరిద్దరి మధ్యే ఎందుకన్న చర్చ సాగుతోంది. సంయుక్త మీనన్ వరుసగా సినిమాల్లో నటిస్తూ అన్ని సినిమాలు సక్సెస్ చేసుకుంటుంది. ఆమె తెలుగులో నటించిన నాలుగు సినిమాలు సక్సెస్ అయ్యాయి. దీంతో ఈ భామ ఫేవరేట్ హీరోయిన్ గా మారిపోయింది.
పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ‘భీమ్లానాయక్’ సినిమా గురించి ఎవరూ మరిచిపోరు. ఈ సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ కాకపోయినా.. పర్యవేక్షణ అంతా ఆయనదే. ఈ క్రమంలో ఇందులో నటులను ఆయనే ఎంపిక చేశారు. ముఖ్యంగా రానా పక్కన నటించేందుకు సంయుక్త మీనన్ ను సెలెక్ట్ చేశారు. ఇందులో ఆమె రెండో హీరోయిన్ అయినా.. ఆమె అభినయానికి ఫిదా అయ్యారు. వెంటనే ఆమెకు ‘బింబిసార’లో అవకాశం వచ్చింది. ఆ తరువాత ధనుష్ తో కలిసి ‘సార్’, సాయిధరమ్ తేజ్ తో కలిసి ‘విరూపాక్ష’లో నటించారు. ఈ నాలుగు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంత సంయుక్త పేరు మారుమోగుతోంది. అయితే ఆమె గురించి మాత్రమే అయితే ఇంత చర్చ ఉండేది కాదు. ఆమెతో కలిపి త్రివిక్రమ్ ను కలిసి ఆడిపోసుకుంటున్నారు. ఓ ఫంక్షన్లో ఇద్దరు కలిసున్న ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి రచ్చ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య చర్చ ఉండడానికి కారణం లేకపోలేదు. ఓ సినీ ఫంక్షన్లో సంయుక్త మీనన్ మాట్లాడుతూ తన గురువు త్రివిక్రమ్ గురించి చెప్పింది. అంతేకాకుండా ‘ఐలవ్ యూ’ అని అనేసిందట. ఈ వ్యాఖ్యలను వేరే రకంగా అర్థం చేసుకున్న కొందరు వీరి మధ్ ఏదో ఉందని అంటున్నారు. ఇక సంయుక్త సింప్లిసిటీ మెయింటేన్ చేస్తుంటారు. నాచురాలిటీగా కనిపిస్తారు. అలా ఉండడం త్రివిక్రమ్ కు బాగా నచ్చిందట. అందుకే ఆమెను ‘బీమ్లానాయక్’లో హీరోయిన్ గా ఎంపిక చేశారు. అయితే ఆమెకు సక్సెస్ ఫుల్ లైఫ్ రావడంతో ఎక్కడికెళ్లినా త్రివిక్రమ్ గురించి పదే పదే చెబుతున్నారట.