Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. లేడీ ఓరియెంటెడ్ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ బబ్లీ బౌన్సర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పూజా కార్యక్రమాలు జరిగాయి. తమన్నా ఈ మూవీలో మహిళా బౌన్సర్‌గా నటించనుంది. త్వరలో ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుపుతామని డైరెక్టర్ మధుర్ భండార్కర్ తెలిపాడు.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. పుష్ప మూవీలోని పాటలకు టీమిండియా క్రికెటర్ చాహల్ భార్య ధనశ్రీ స్టెప్పులు వేసింది. ‘ఏయ్ బిడ్డా’, ‘ఊ అంటావా’ హిందీ వెర్షన్ పాటలకు డ్యాన్స్ వేసి ధనశ్రీ అదరగొట్టగా.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు డ్రామా కంటే డ్యాన్స్ అంటే ఇష్టమని ఈ సందర్భంగా ధనశ్రీ చెప్పుకొచ్చింది. కాగా గతంలోనూ పలువురు క్రికెటర్లు పుష్ప మూవీ పాటలకు స్టెప్పులు వేశారు.
Also Read: ఎన్టీఆర్ మూవీ దానవీరశూరకర్ణ 15రెట్లు లాభాలు తెచ్చిందట.. డైరెక్టర్ ఎవరంటే..?

ఇక మరో అప్ డేట్ ఏమిటంటే.. కోలీవుడ్ నటి అమలాపాల్ భారీగా రెమ్యూనరేషన్ పెంచినట్లు సమాచారం. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఘోస్ట్ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో హీరోయిన్‌గా అమలాపాల్‌ను చిత్ర యూనిట్ సంప్రదించిందట. అయితే అమలాపాల్ భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోంది.

ఆమె ఎక్కువ డిమాండ్ చేయడంతో మేకర్స్ వెనకడుగు వేశారని సమాచారం. దీంతో అమలాపాల్, నాగ్ సినిమాలో నటించేందుకు నో చెప్పిందనే టాక్ నడుస్తోంది. మొత్తానికి అమలాపాల్ కూడా భారీగా రెమ్యునరేషన్ పెంచడం షాకింగ్ విషయమే.
Also Read: రివ్యూ : “సన్ ఆఫ్ ఇండియా”