Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. యంగ్ హీరో నాగచైతన్య తన కొత్త సినిమాను తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో చేయనున్నారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ఈ సినిమా గురించి మరో విషయం బయటకు వచ్చింది. ఈ మూవీలో హీరోయిన్‌గా పూజాహెగ్డేను తీసుకోవాలని మూవీ యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. త్వరలో దీనిపై క్లారిటీ రానుంది.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాటలోని ‘కళావతి’ పాట టీచర్లకూ పాకింది. ఓ తరగతి గదిలో ఇంటర్ విద్యార్థులకు కెరీర్ గురించి వివరిస్తున్న లెక్చరర్.. కళావతి పాటను ఉదాహరణగా తీసుకున్నారు. మంచి ఉద్యోగాలు వస్తే జీతాలు.. ‘ఒక వందో, ఒక వెయ్యో, ఒక లక్షో..’ అంటూ వివరించారు. ‘కళావతి అని కాదు సరస్వతి.. సరస్వతి’ అని పాడుకోవాలని విద్యార్థులకు హితబోధ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది.
Also Read: Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగ ఖాళీలు.. పది అర్హతతో?

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ ముగిసింది. డైరెక్టర్ సాగర్ కె. చంద్ర.. పవన్ కల్యాణ్, డీవోపీ రవి కె చంద్రన్‌తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. షూటింగ్ కంప్లీట్ అయిందని తెలిపాడు.

ఈ మూవీ ఫిబ్రవరి 25న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. త్వరలో ట్రైలర్ రానుంది.