Tollywood Crazy Updates: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే… అందం, అభినయంతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శృతి హాసన్. స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంటూ టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది ఈ భామ. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రమైన సలార్ మూవీలో ప్రభాస్ సరసన నటిస్తుంది. అయితే మరోవైపు శ్రుతి ఓ వెబ్ సిరీస్‌లోను నటిస్తోంది.ఈ వెబ్ సిరీస్‌కు బెస్ట్ సెల్లర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అమెజాన్ లో ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 18న రిలీజ్ కానుంది.

మరో క్రేజీ అప్ డేట్ కి వస్తే.. ప్రముఖ డైరెక్టర్ శంకర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ సినిమాను హాలీవుడ్ రేంజ్‌లో తీర్చిదిద్ది విజువల్ వండర్స్ క్రియేట్ చేస్తారు. ఇక కమల్, రజనీ, విక్రమ్ సహా ఎంతోమందికి తమ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ చిత్రాలు ఇచ్చిన డైరెక్టర్ ఆయన. ఇప్పుడు శంకర్ తన కొడుకు తనయుడు అర్జిత్‌ను హీరోగా లాంచ్ చేయనున్నారు.
Also Read: పునీత్‌కి డబ్బింగ్ చెప్పడం చాలా కష్టమైంది- శివరాజ్ కుమార్

అలాగే మరో అప్ డేట్ కి వస్తే..తమిళ సూపర్‌స్టార్ అజిత్ కుమార్ కొత్త సినిమా గురించి ఓ ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. హెచ్ వినోత్ దర్శకతంలో వస్తున్న “వలిమై” చిత్రంలో సీనియర్ భామ టబు నటించనుందని వినికిడి. ఇదే నిజమైతే దాదాపు 22 ఏళ్ల తర్వాత అజిత్-టబు కలిసి నటించినట్లు అవుతుంది. వీరిద్దరూ గతంలో ‘ప్రియురాలు పిలిచింది’ అనే సూపర్‌హిట్ సినిమాలో నటించారు. అందులో ఐశ్వర్య రాయ్, మమ్ముట్టి కూడా ప్రధాన పాత్రల్లో మెరిశారు.

ఇక లాస్ట్ అప్ డేట్ కి వస్తే.. లెజండరీ డైరెక్టర్ శంకర్ అప్పట్లో నిర్మించిన ప్రేమిస్తే చిత్రం ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. కాదల్‌గా తమిళంలో వచ్చిన ఈ చిత్రం, ప్రేమిస్తేగా తెలుగులోనూ సంచలనమే. కాలేజీ కుర్రకారంతా ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. శంకర్ తనయుడు ఆర్జిత్‌ను హీరోగా లాంచ్ చేయడానికి ఇదే సరైన స్క్రిప్ట్ అని శంకర్ భావించారట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయినట్లు సమాచారం.
Also Read: మరదలి నగ్న వీడియోలు తీసిన బావ.. భార్యకు తెలియడంతో భర్త షాక్.. చివరకు..
[…] Also Read: టాలీవుడ్ : టుడే వైరల్ అవుతున్న క్రేజీ … […]