Tollywood Crazy Updates: టాలీవుడ్ ప్రజెంట్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో గతంలో మహేశ్ బాబు ‘జనగణమన’ అనే సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. కానీ సినిమా సెట్ కాలేదు. ఆ తర్వాత కూడా పూరి మహేష్ తో సినిమా చేయడానికి ప్రయత్నించాడు, కానీ కుదరలేదు. ఇప్పుడు అదే కథతో విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. అయితే లైగర్ రిజల్ట్ పైనే నెక్ట్స్ ప్రాజెక్ట్ ఆధారపడి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పూరి గత సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’ సంచలన విజయాన్ని సాధించింది. తాజాగా హీరో విజయ్ దేవరకొండ బాక్సర్ గా ఆయన ‘లైగర్’ను రూపొందిస్తున్నాడు.

మరో అప్ డేట్ విషయానికి వస్తే.. ప్రస్తుత కరోనా పరిస్థితులపై హీరో నిఖిల్ ఆందోళన వ్యక్తం చేశాడు. ‘అర్జున్ సురవరం సక్సెస్ తర్వాత నేను 4 సినిమాలకు సైన్ చేశా. వాటి రిజల్ట్‌పై చాలా నమ్మకంతో ఉన్నా. కానీ రిలీజ్ డేట్స్ మన చేతుల్లో లేకుండా పోయాయి. ఈ పరిస్థితుల నుంచి త్వరగా బయటపడి, సినిమాలన్నీ అనుకున్న సమయానికి విడుదల కావాలని దేవుడ్ని కోరుకుంటున్నా’ అని నిఖిల్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Also Read: జగన్‌కు కొత్త టెన్షన్.. జిల్లాల ఏర్పాటుతో వైసీపీలో ఇలా జరుగుతుందేంటి..

అలాగే మరో అప్ డేట్ విషయానికి వస్తే.. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్‌రాజు ఇప్పుడు ఓటీటీలో అడుగుపెడుతున్నాడు. డైరెక్టర్ హరీష్ శంకర్‌తో కలసి ‘ఏటీఎమ్’ అనే రాబరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేస్తున్నాడు. దీనికి హరీష్ కథను అందిస్తుండగా చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్నాడు. జీ5 సంస్థతో కలిసి ఈ సిరీస్‌ను నిర్మించనున్నట్లు దిల్‌రాజు, హరీష్ ప్రకటించారు.

Also Read: పశ్చిమ గోదావరిని భయపెడుతోంది!
[…] Shweta Tiwari: మధ్యప్రదేశ్ కి చెందిన యంగ్ హీరోయిన్ శ్వేతా తివారి ‘దేవుడు నా బ్రా సైజ్ కొలుస్తున్నాడు’ అని కామెంట్ చేసింది. తన వెబ్ సిరీస్‌ను ఉద్దేశిస్తూ అలా చెప్పింది ఆమె. తన సిరీస్ లో డైలాగ్ అట అది. ఆమె సరదాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. దీని పై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. […]