
Bharadwaja Thammareddy Controversy: సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. ఇటీవల ఓ చిత్ర ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న తమ్మారెడ్డి… ఆస్కార్ అవార్డు కోసం ఆర్ ఆర్ ఆర్ మేకర్స్ రూ. 80 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ డబ్బుతో ఒక ఎనిమిది సినిమాలు తీయొచ్చు. వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ కే కోట్లు ఖర్చుపెట్టారని ఎద్దేవా చేశారు. డబ్బులు ఎదురు పెట్టి ఆస్కార్ వరకూ వెళ్లారన్న అర్థంలో తమ్మారెడ్డి భరద్వాజ ఈ కామెంట్స్ చేసిన నేపథ్యంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.
తమ్మారెడ్డి కామెంట్స్ ని నటుడు నాగబాబు తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. రూ.80 కోట్లు నీయమ్మా మొగుడు ఖర్చుపెట్టాడా? అంటూ ట్వీట్ చేశాడు. అనంతరం కే రాఘవేంద్రరావు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఆయన మర్యాదగానే తమ్మారెడ్డికి చురకలు అంటించాడు. డబ్బులు ఖర్చుపెట్టినట్లు మీ దగ్గర ఆధారాలు, లెక్కలు ఉన్నాయా? అని నిలదీశారు. రాఘవేంద్రరావు తన ట్వీట్లో… ‘మిత్రుడు భరద్వాజ్ కి, తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు సంగీతానికి, తెలుగు దర్శకులకు, తెలుగు నటులకు ప్రపంచ సినిమా వేదికలపై వస్తున్న గౌరవానికి గర్వపడాలి. అంతే కానీ రూ. 80 కోట్లు ఖర్చుపెట్టారని చెప్పడానికి మీ దగ్గర అకౌంట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? . జేమ్స్ కామెరాన్, స్పీల్ బర్గ్ వంటి దర్శకులు డబ్బులు తీసుకొని మన సినిమాను పొగుడుతున్నారని నీ అర్థమా…’ అని నేరుగా ప్రశ్నించారు.
తమ్మారెడ్డి పలుమార్లు చిత్ర పరిశ్రమను, ప్రముఖులను టార్గెట్ చేస్తూ అనుచిత కామెంట్స్ చేసిన నేపథ్యంలో మొదటిసారి అతనికి టాలీవుడ్ కౌంటర్లు ఇస్తుంది. పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి కూడా తమ్మారెడ్డి అభ్యంతర కామెంట్స్ చేశారు. సినిమాకు యాభై కోట్లు తీసుకునే పవన్ కళ్యాణ్ పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నారా? అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.

తమ్మారెడ్డి ఆర్ ఆర్ ఆర్ సినిమాను టార్గెట్ చేయడం వెనుక పొలిటికల్ కోణం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. నటుడు నాగబాబు తమ్మారెడ్డిని మరో వీడియోలో ఏకిపారేశారు. నువ్వు ఎన్ని సినిమాలు తీశావు? అందులో హిట్స్ ఎన్ని? నీ సినిమాల్లో నటించిన నటులకు రెమ్యూనరేషన్ సరిగా ఇచ్చావా? పెద్ద మేధావులా విశ్లేషణలు ఎందుకని ప్రశ్నించారు. మంచిని హర్షించే సంస్కారం లేదని దుయ్యబట్టారు. నాగబాబు ఇంస్టాగ్రామ్ వీడియో వైరల్ అవుతుంది.
