Rakesh Master Passes Away : సోషల్ మీడియా లో తరచూ ట్రెండింగ్ లో ఉండే అతి తక్కువ మందిలో ఒకరు రాకేష్ మాస్టర్.యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా కామెంట్స్ చేస్తూ, విచిత్రమైన వీడియోస్ చేస్తూ ఆయన యూట్యూబ్ సెలబ్రిటీ గా నిలిచాడు, అలా అందరికీ ఎంతో దగ్గరగా కనెక్ట్ అయిన రాకేష్ మాస్టర్ ఈరోజు మృతి చెందాడు అనే వార్త యావత్తు సినీ లోకాన్ని మరియు అభిమానులను శోకసంద్రం లోకి నెట్టేసింది.
ఇటీవలే ఆయన యూట్యూబ్ లో తన ఛానల్ లో ప్రత్యేక ప్రోగ్రాం కోసం సోషల్ మీడియా లో మంచి పాపులారిటీ ని దక్కించుకున్న అగ్గిపెట్టె మచ్చ , స్వాతి నాయుడు , సునిశిత్ వంటి వారిని ఉత్తరాంధ్ర ప్రాంతం లోని శ్రీకాకుళం కి తీసుకెళ్లాడు. అక్కడ వీళ్ళు చేసిన వీడియోస్ సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే, ఈ వీడియోస్ ని మీమెర్స్ తెగ వాడుకున్నారు కూడా.

అయితే ఈ ప్రోగ్రాం చేస్తున్న సమయం లోనే ఆయన తీవ్రమైన అస్వస్థకు గురి అవ్వడం తో వెంటనే వైజాగ్ హాస్పిటల్ లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ తన చివరి శ్వాసని వదిలాడు. రాకేష్ మాస్టర్ సినిమా ఇండస్ట్రీ లో మంచి పేరున్న కొరియోగ్రాఫర్ అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు మోస్ట్ డిమాండ్ ఉన్న కొరియోగ్రాఫర్స్ లో ఒకరైన శేఖర్ మాస్టర్ ఇతని శిష్యుడే. మహేష్ బాబు ,రవితేజ , రామ్ పోతినేని , అక్కినేని నాగార్జున, వేణు తొట్టెంపూడి ఇలా ఎంతో మంది స్టార్ హీరోలకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసాడు.
అయితే కొత్తవాళ్లు రాకతో ఈయనకి ఇండస్ట్రీ లో అవకాశాలు బాగా తగ్గిపోయాయి, అప్పటి నుండి ఆయన యూట్యూబ్ ని తన జీవనాధారంగా మలచుకొని, ఇంటర్వ్యూస్ మరియు క్రేజీ వీడియోస్ క్రియేట్ చేస్తూ , యూట్యూబ్ స్టార్స్ లో ఒకడిగా నిలిచాడు. ఇప్పుడు ఆయన ఈరోజు మన మధ్య లేడు అనే వార్త అభిమానులకు జీరిణీంచుకోలేని విషయం గా మారింది.