https://oktelugu.com/

Fake Marriages : సోషల్ మీడియాలో ఫేక్ పెళ్లిళ్ళు చేసుకున్న సెలబ్రెటీలు వీరే..

మేము పెళ్లి చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అందరికీ చెప్పే చేసుకుంటాం కానీ రోజుకొక పెళ్లి చేయొద్దు అంటూ వారు వేడుకుంటున్నారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 19, 2024 6:09 pm
    Follow us on

    Fake Marriages : కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు.. రూమర్ లాంటి వార్త దొరికినా కొందరికి పండుగనే. వాటిని తెగ ట్రోల్స్ చేస్తుంటారు ట్రోలర్స్. సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలను నిత్యం చూస్తుంటాం. ఎంత ఎక్కువగా నెటిజన్లు ఒక వార్త గురించి మాట్లాడుకుంటే ఆ విషయం అంత ఎక్కువగా వైరల్ అవుతుందని అర్థం. అలా వైరల్ అవ్వడానికి రకరకాల వార్తలను మీడియాలో వదలడం కొంతమంది ఆకతాయిలకు అలవాటుగా మారింది. ఈ అలవాటులో భాగంగానే ఎలాంటి రిలేషన్ లేని సెలబ్రెటీల మధ్య ఏదో ఉందంటూ కొందరికి ఏకంగా పెళ్లిళ్లు కూడా చేసేస్తుంటారు. ఆ విధంగా ఫేక్ పెళ్లిళ్లు చేసుకున్న సెలబ్రెటీలు ఎవరో ఓ సారి చూసేయండి.

    ఇండస్ట్రీలో ఎవరైనా పెళ్లి చేసుకుని భర్తకు దూరంగా ఉన్నా లేదా భర్త చనిపోయి ఒంటరిగా ఉన్నా.. భార్య చనిపోయి లేదా విడాకులు ఇచ్చి నటుడు ఒంటరిగా ఉంటే.. ట్రోలర్స్ కు పండగలా కనిపిస్తుంది. సెలబ్రెటీలనే కాదు సెలబ్రెటీలకు దగ్గరి బంధువులు, వారి కుటుంబంలోని వారిని సైతం వదలకుండా ట్రోల్ చేస్తుంటారు.సోషల్ మీడియాలో ఫలానా నటి రెండో పెళ్లి చేసుకోబోతుందని లేదా సహజీవనం చేస్తుందని తరచూ కొన్ని వార్తలు వస్తుంటాయి. అంతే కాదు రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారంటారు. నిజానికి అందులో వాస్తవం ఉండదు.

    ఈమధ్య జయసుధ సైతం రెండో పెళ్లి చేసుకుంటుంది అంటూ ఓ వార్త చక్కర్లు కొట్టింది. తన కొడుకులకు పెళ్లిళ్లు చేసే వయసులో ఉన్న జయ సుధ పెళ్లి చేసుకోవడం అనేది జరగని పని. కానీ ఆమెకు ప్రస్తుతం భర్త లేడు కాబట్టి మీడియా పెళ్లి చేసేస్తోంది. నటి ప్రగతి కూడా రెండో పెళ్లికి సిద్దమైందని తరచూ వార్తలు వస్తుంటాయి. అది నిజమో, కాదో తెలియకుండానే ఒకరిని చూసి మరొకరు ఎవరికి నచ్చినట్టు వారు రాస్తున్నారు. ఇక నటి సురేఖ పెళ్లిళ్ళ గోల అయితే మామూలుగా ఉండదు. ఆమె రెండో పెళ్లి గురించి నిత్యం ఏదో ఒక వార్త వింటూనే ఉంటాం. ఇక చిరంజీవి కూతురు శ్రీజ ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టడంతో దాన్ని ఏకంగా మూడో పెళ్లిగా పరిగణించి చిరంజీవి చిన్న కూతురుకు మూడో పెళ్లి అంటూ ట్రోల్ చేశారు. వీటిని వెంటనే ఖండించకపోతే లాభం లేదని శ్రీజ వెంటనే ఆమె పెట్టిన పోస్ట్ కి అర్థం చెప్పింది.

    ఇలా ఒంటరిగా ఉండి కాస్త అందంగా ఉన్న సెలబ్రిటీలకు ఈ రెండో పెళ్లి గోల తప్పడం లేదు. మీడియా వారి సొంతానికి పెళ్లిళ్లు చేసేస్తూ ఉంటుంది. వారికి ప్రైవసీ ఉంటుంది కాబట్టి వారి వ్యక్తిగత జీవితంలో అవసరం లేకపోయినా దూరడం మీడియాకు తగదు. వారి మనోభావాలను దెబ్బతీయకుండా ఉంటే మంచిది. ఒకరి జీవితాలను కాలరాయడానికి ఇంకొకరి జీవితాలపై ఫేక్ న్యూస్ ప్రచారం చేయడానికి ఎవరికీ అర్హత లేదు. అలా చేసి ఎంతో మందిని ఇబ్బందికి గురి చేస్తున్నారు. కనీసం అందులో నిజం ఎంత ఉంది అని కూడా ఆలోచించకుండా ఎంతో మంది సెలబ్రెటీలను ఇబ్బంది పెట్టేస్తున్నారు. సోషల్ మీడియా పై కంప్లైంట్స్ చెయ్యలేరు అనే కాన్ఫిడెన్స్ తో ఇలా ఫేక్ వార్తలను సృష్టించి వదిలేయడం అలవాటు చేసుకున్నారు.ఇకనైనా ఇలాంటి ఫేక్ వార్తలను రాయడం ఆపేస్తే బాగుంటుంది అని సెలబ్రిటీస్ ఫీలవుతున్నారు. మేము పెళ్లి చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అందరికీ చెప్పే చేసుకుంటాం కానీ రోజుకొక పెళ్లి చేయొద్దు అంటూ వారు వేడుకుంటున్నారు.