RRR Movie: దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మెగా, నందమూరి ఫ్యామిలిలకు చెందిన ఇద్దరూ స్టార్ హీరోలతో కలిసి దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించిన ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్… తారక్ కి జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్ నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీని.. ఎప్పుడెప్పుడు చూడాలా..అనే వెయిటింగ్ విపరీతంగా ఉంది. దానికి తగ్గట్టే రీసెంట్ గా ఈరోజు రిలీజ్ అయిన ట్రైలర్ య్యూట్యూబ్ కుంభస్థలాన్నే కొట్టేస్తోంది. రికార్డు లెవల్ వ్యూస్‌తో ఈ ట్రెయిలర్ రిలీజ్ అయిన అన్నీ భాషల్లో దుమ్మురేపుతుంది. అంచనాలకు మించి అలరిస్తున్న ఈ ట్రైలర్ పట్ల టాలీవుడ్ ప్రముఖులు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.

సినీ ప్రముఖులు సైతం ట్రైలర్ చూసిన తర్వాత తమ ఎగ్జైట్మెంట్ ను ఆపుకోలేకపోతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వారి అబిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ హీరోయిన్ సమంత ట్రైలర్ పై కామెంట్ చేయడానికి మాటలు రావడం లేదంటూ ట్వీట్ చేసింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ర్ ఫోటో ను ట్యాగ్ చేస్తూ… ఎన్టీఆర్ నిజంగా పులి… ఎన్టీఆర్ కంటిలోని ఫైర్ ఎలాంటి.. ఫీట్ అయినా చేయగలడు అంటూ ట్వీట్ చేసింది. అటు రామ్ చరణ్ ఫోటోను ట్యాగ్ చేసి… రామ్ చరణ్ నుంచి ఇలాంటి పర్ఫామెన్స్ చూడలేదు.. ఫైర్.. ఫైర్…ఫైర్ ” అంటూ ట్వీట్ చేసింది సమంత. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. “ట్రైలర్ చూస్తే గర్వంగా ఉంది. నెక్స్ట్ లెవల్ సినిమా ఇది ఆర్ఆర్ఆర్ ” అని రాసుకొచ్చాడు. అలాగే సందీప్ రెడ్డి వంగా.. ”ఇది భగవంతుని పని అని నేను ఖచ్చితంగా నమ్ముతాను” , ప్రశాంత్ వర్మ” నా గూస్ బంప్స్ కి గూస్బంప్స్ వచ్చాయి”, హరీష్ శంకర్..”ఈ అనుభూతిని వ్యక్తపరచడానికి నాకు పదాలు లేవు.. ‘గూస్ బంప్స్’ ‘అడ్రినలిన్ రష్’.. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ చూసిన తర్వాత మానసిక స్థితిని వర్ణించడానికి సరిపోదు” అని రాసుకొచ్చారు.
Also Read: “ఆర్‌ఆర్‌ఆర్” ట్రైలర్ పై స్పందించిన మెగా స్టార్ చిరంజీవి, మహేష్ బాబు…
https://twitter.com/Samanthaprabhu2/status/1468900468776603650?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1468900468776603650%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fmanalokam.com%2Fnews%2Fsamantha-comments-on-rrr-trailer.html
Proud 🤙🔥
Next level cinema! #RRRMoviehttps://t.co/wFV0jgYBO1— Vijay Deverakonda (@TheDeverakonda) December 9, 2021
Am short of words to express this feeling … “goosebumps”
”adrenaline rush “ are not enough to describe the mental state after watching this ….. @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 https://t.co/QiVSUXdka6— Harish Shankar .S (@harish2you) December 9, 2021
Also Read: మరదలి పెళ్ళిలో డాన్స్ ఇరగతీసిన రామ్ చరణ్…