Tollywood Boxoffice 2022: 2022 వ సంవత్సరం ముగింపునకు వచ్చేసింది.. ఈ ఏడాది మొత్తం మన టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల హవా కంటే ఎక్కువగా డబ్బింగ్ సినిమాలు.. చిన్న సినిమాల హవానే ఎక్కువగా నడిచింది..ఒక సినిమా అద్భుతాలు సృష్టించాలంటే ఇప్పుడు స్టార్ స్టేటస్ తో పని లేదు అని నిరూపించిన ఏడాది ఇది..అంతే కాకుండా ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన పాన్ ఇండియన్ సినిమాలు కూడా సత్తా చాటాయి..ప్రథమార్థం స్టార్ హీరోల సినిమాలన్నీ విడుదలై వెళ్లిపోయిన తర్వాత వచ్చిన మీడియం రేంజ్ సినిమాలు ఇండస్ట్రీని సంక్షోభం లోకి నెట్టేశాయి.. కానీ ఆ తర్వాత వెంటనే పలు హిట్ సినిమాలతో బౌన్స్ బ్యాక్ అయ్యింది..ఈ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టి బయ్యర్స్ కి భారీ లాభాలను తెచ్చిపెట్టిన సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1)బంగార్రాజు :

అక్కినేని నాగార్జున – అక్కినేని నాగచైతన్య కాంబినేషన్ లో ఈ ఏడాది ప్రారంభం లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు వచ్చాయి..చాలా కాలం నుండి సరైన హిట్టు లేకుండా ఇబ్బంది పడుతున్న నాగార్జున కెరీర్ లో మంచి సూపర్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం..34 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రానికి..34 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..లాభాలు లేవు..నష్టాలు లేవు..కేవలం హిట్ గా మాత్రమే మిగిలింది.
2) DJ టిల్లు:

సిద్దు జొన్నలగడ్డ మరియు నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 12 వ తారీఖున విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది..ముఖ్యంగా యూత్ కి పిచ్చెక్కిపోయ్యేలా చేసింది ఈ సినిమా..హీరో సిద్దు నటన,అతని కామెడీ టైమింగ్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది..కేవలం 7 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమాకి 15 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి..అలా చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రానికి 8 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి.
3 ) భీమ్లా నాయక్ :

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 25 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలయ్యింది..పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ చిత్రానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి అడుగడుగునా అడ్డంకులు ఎదురు అయ్యాయి..ఆంధ్ర ప్రదేశ్ లో అతి తక్కువ టికెట్ రేట్స్ తో విడుదల అవ్వడం వల్ల ఈ మూవీ కలెక్షన్స్ పై చాలా తీవ్రమైన ప్రభావం పడిందనే చెప్పాలి..103 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి GST తో కలిపి 100 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి..నష్టం చాలా స్వల్పం కాబట్టి సెమీ హిట్ గా చెప్పుకోవచ్చు.
4) #RRR:

ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది..అందరికి తెలిసిందే..రామ్ చరణ్ – ఎన్టీఆర్ – రాజమౌళి స్టామినా కి బౌండరీలు సైతం బద్దలైపోయాయి..సుమారుగా 1200 కోట్ల గ్రాస్ ని వసూలు చేసి చరిత్ర సృష్టించింది..ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 225 కోట్ల రూపాయలకు జరిగింది..ఫుల్ రన్ లో 266 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..అంటే కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండే ఈ సినిమాకి 40 కోట్ల రూపాయలకు పైగా లాభాలు వచ్చాయి అన్నమాట..వరల్డ్ వైడ్ గా అన్ని ప్రాంతాలకు కలిపి 150 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి.
5 ) KGF చాప్టర్ 2:

#RRR వంటి ప్రభంజనం తర్వాత వచ్చిన మరో పాన్ ఇండియన్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ఇది..కన్నడ వంటి చిన్న ఇండస్ట్రీ నుండి ఒక సినిమా విడుదలై ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టడం అంటే మాములు విషయం కాదు..కేవలం తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్ 90 కోట్ల రూపాయలకు జరగగా..ఫుల్ రన్ లో 110 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది..అంటే 20 కోట్ల రూపాయిలు లాభాలు వచ్చాయి అన్నమాట.
6) విక్రమ్ :

కమల్ హాసన్ పని ఇక అయిపోయింది అని అనుకుంటున్న సమయం లో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర విస్ఫోటనం ని సృష్టించింది..400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా తమిళ నాడు లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది..తెలుగు లో ఈ చిత్రాన్ని ప్రముఖ హీరో నితిన్ 6 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసాడు..ఫుల్ రన్ లో 18 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..అంటే పెట్టిన డబ్బులకు మూడింతల లాభాలు వచ్చాయి అన్నమాట.
7)మేజర్ :

అడవి శేష్ హీరో గా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఒక సెన్సేషన్..మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించాడు..ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 15 కోట్ల రూపాయలకు జరగగా ఫుల్ రన్ లో 30 కోట్లకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి..అంటే జరిగిన బిజినెస్ కి రెండింతల లాభాలను తెచ్చిపెట్టింది ఈ సినిమా.
8)సీతారామం:

సైలెంట్ గా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద విస్ఫోటనం లాగ పేలిన బాంబు సీతారామం చిత్రం..కేవలం 18 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రానికి 40 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టి బయ్యర్స్ కి 22 కోట్ల రూపాయిల లాభాలను తెచ్చిపెట్టింది..మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ఈ చిత్రం ద్వారా నేరుగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకి పరిచయం..అంతకుముందు మలయాళం లో ఆయన నటించిన డబ్బింగ్ సినిమాలు ఇక్కడ విడుదల అయ్యాయి.
9) భింబిసారా :

నందమూరి కళ్యాణ్ రామ్ తన కలలో కూడా ఊహించని వసూళ్లు ఈ సినిమాకి వచ్చాయి..15 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి ఫుల్ రన్ లో 36 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి..బయ్యర్స్ కి 21 కోట్ల లాభాలు వచ్చాయి..కళ్యాణ్ రామ్ ని కేవలం హీరో గా మాత్రమే కాదు..నిర్మాతగా కూడా ఈ సినిమా నిలబెట్టింది.
10) కార్తికేయ 2 :

యంగ్ హీరో నిఖిల్ నటించిన ఈ సినిమా అనూహ్యంగా పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది..14 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమాకి దాదాపుగా 60 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..బయ్యర్స్ కి 46 కోట్ల రూపాయిల లాభాలను రాబట్టి టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
11)కాంతారా :

15 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ కన్నడ చిత్రం సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది..అందరికి తెలిసిందే..విడుదలైన అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ ని అల్లు అరవింద్ కొనుగోలు చేసాడు..రెండు కోట్ల రూపాయలకు రైట్స్ ని కొంటే ఫుల్ రన్ లో 30 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టి 28 కోట్ల రూపాయిల లాభాల్ని తెచ్చిపెట్టింది ఈ సినిమా.