Anasuya Bharadwaj: స్టార్ యాంకర్ అనసూయ సోషల్ మీడియా వేదికగా అందాల విందుకు తెరలేపింది. పరువాల ప్రదర్శన చేస్తూ గుండెలు పిండేస్తుంది. అనసూయ అందాల జడిలో జనాలు కొట్టుకుపోతున్నారు. బ్లూ ట్రెండీ వేర్ ధరించిన అనసూయ చేతులు పైకెత్తి నడుము వంపులు చూపించింది. అనసూయ ఫోజులు సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతున్నాయి. అనసూయ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ గా మారాయి.
ఇటీవల అనసూయ షార్ట్ వెకేషన్ ఎంజాయ్ చేశారు. వారం రోజుల పాటు ఇష్టమైన ప్రదేశంలో చక్కర్లు కొట్టారు. కొడుకు బర్త్ డే నేపథ్యంలో సమ్మర్ వెకేషన్ కూడా కలిపి ప్లాన్ చేశారు. ఈ వెకేషన్ అనసూయ ఇష్టమైన ఫుడ్ లాగించిందట. దాంతో బరువు పెరిగిందట. జిమ్ లో కష్టపడుతున్న వీడియో పోస్ట్ చేసిన ఆమె అనవసరంగా తినేశానని భాదపడ్డారు. ఇద్దరు పిల్లల తల్లైన అనసూయ ఫిట్ అండ్ స్లిమ్ బాడీ మైంటైన్ చేయడం చిన్న విషయం కాదు.
అనసూయ పూర్తిగా శాకాహారి కాగా బరువు పెరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. యాంకరింగ్ మానేసిన అనసూయ పూర్తి దృష్టి నటన మీద పెట్టారు. ఆమె వరుస ఆఫర్స్ తో బిజీగా ఉన్నారు. ఆమె లేటెస్ట్ మూవీ విమానం. ఈ మూవీలో అనసూయ వేశ్య పాత్ర చేస్తున్నట్లు సమాచారం. లిరికల్ సాంగ్ విడుదల చేయగా దీనిపై స్పష్టత వచ్చింది. వేశ్యగా నటించడం సాహసం. అనసూయ తన గట్స్ నిరూపించుకుంది.
కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకెళుతుండగా అనసూయ వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో ఆమెకు పెద్ద పంచాయితీ అయ్యింది. విజయ్ దేవరకొండ పేరుకు ముందు The అనే వాడటాన్ని అనసూయ తప్పుబట్టారు. పైత్యం బాగా ముదిరిపోయిందంటూ ట్వీట్ చేసింది. అనసూయ ట్వీట్ తో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో యుద్ధానికి దిగాడు. మీరు ఎంత ట్రోల్ చేసినా నేను తగ్గేది లేదని అనసూయ నేరుగా చెప్పారు. ప్రస్తుతానికి ఈ వివాదం సద్దుమణిగింది.