Homeఎంటర్టైన్మెంట్Samantha Serious Counter To Netizen: నెటిజన్ ప్రశ్నకు సమంత సీరియస్.. అసలు ఏం అడిగాడంటే..?

Samantha Serious Counter To Netizen: నెటిజన్ ప్రశ్నకు సమంత సీరియస్.. అసలు ఏం అడిగాడంటే..?

Samantha Serious Counter To Netizen: సమంత.. టాలీవుడ్ కు ఈ పేరు సుపరిచితం.. ఏమాయ చేసావే మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం హాలీవుడ్ రేంజ్‌కు ఎదిగింది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత తన కెరీర్ పైనే ఫోకస్ పెట్టింది ఈ భామ. ప్రస్తుతం చేతినిండ సినిమాలతో బిజీగా ఉంది. ఈ మధ్య పుష్ప మూవీలో ఊ అంటావా మామా.. ఊహూ అంటావా మామా.. అనే ఐటం సాంగ్‌లో యాక్ట్ చేసి కుర్రాళ్ల గుండెల్లో మంటపెట్టింది.

Samantha Serious Counter To Netizen
Samantha Serious Counter To Netizen

తాజాగా తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసిన ఈ అమ్మడు.. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఘాటుగా రిప్లై ఇచ్చింది. అతనికి వార్నింగ్ సైతం ఇచ్చింది. అప్పటి వరకు చాలా కూల్ గా మాట్లాడిన సమంత.. ఉన్నట్టుండి ఎందుకంత సీరియస్ అయింది.. అసలు ఆ నెటిజన్ ఏం ప్రశ్న అడిగాడు..?

Samantha Serious Counter To Netizen
Tollywood Actress Samantha Serious Counter To Netizen

Also Read: వైరల్ అవుతున్న టుడే క్రేజీ అప్ డేట్స్

ఇండస్ట్రీకి చెందిన వారు అప్పుడప్పుడు తమ ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తారు. ఇందులోనూ ముఖ్యంగా తమ మూవీస్ రిలీజ్ అయ్యే టైంలో లేదా ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ తో మాట్లాడటం కామన్. సమంత యాక్ట్ చేసి శాకుంతలం మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. ఈ సందర్భంగా తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసింది సమంత. ఈ సందర్భంగా ఆస్క్ మీ అంటూ అభిమానులతో కొద్దిసేపు ముచ్చటించింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ వచ్చింది.

Also Read: చరణ్ సినిమాలో సీఎంగా ‘సూర్య’

Samantha Serious Counter To Netizen
Actress Samantha Serious Reply To Netizen

ఇంతలో ఓ నెటిజన్ మీ ప్రతిరూపానికి ఎప్పుడు జీవం పోస్తున్నారు.. ఎందుకంటే మీలాంటి వాళ్లు మరొకరిని తయారు చేయడం చాలా అవసరం అన్నట్టు సమంతను ప్రశ్నించాడు. అప్పటి వరకు కూల్ గా ఉన్న సమయంతో ఈ ప్రశ్నతో చాలా ఆగ్రహానికి గురైంది. ఆ నెటిజన్‌కు దిమ్మతిరిగేలా రిప్లై ఇచ్చింది. ముందు నువ్వు ప్రశ్న అడిగేటప్పుడు దాని అర్థమేంటి అనేది గూగుల్ చెక్ చేసుకో.. అంటూ వార్నింగ్ ఇచ్చింది. అనంతరం కొద్ది సేపు చిట్ చాట్ చేసి ఆఫ్ లైన్ లోకి వెళ్లిపోయింది.

Also Read: దీపికా పదుకొణె పెళ్లి అయ్యాక ఈ ఎక్స్ పోజింగ్ ఏంటి?

Recommended Video:

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

2 COMMENTS

  1. […] Senior Actor Naresh: హైదరాబాద్‌లో మరో భారీ స్కాం వెలుగు చూసింది. ఇప్పటికే కిట్టీ పార్టీల పేరుతో సంపన్న మహిళలను టార్గెట్ చేసుకుని కోట్లు కొల్లగొట్టిన శిల్పా చౌదరి ఉదంతం బయటపడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో పోలీసుల విచారణలో మరో స్కాం బహిర్గతమైంది. సీనియర్ నటుడు నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి అనేక మందిని మోసం చేసి డబ్బులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular