Anushka Shetty Marriage: స్వీటీ అనుష్క ఇండస్ట్రీకి వచ్చి దగ్గర దగ్గరగా రెండు దశాబ్దాలు అవుతుంది. అయినా, ఇప్పటికీ అనుష్కకి ఫుల్ క్రేజ్ ఉంది. హీరోయిన్ గా కూడా ఫుల్ ఫామ్ లో ఉన్నా.. సినిమాలను మాత్రం ఎక్కువ అంగీకరించట్లేదు. ఎలాగూ యంగ్ బ్యూటీస్ రష్మిక, పూజా హెగ్డే, కీర్తి సురేష్, కృతి శెట్టి, కేతిక శర్మ లాంటి కొత్త భామలు వరుస అవకాశాలతో రెచ్చిపోతున్న క్రమంలో అనుష్క సినిమాలను తగ్గించింది.

మరోపక్క అనుష్కతో పాటు హీరోయిన్ గా వచ్చిన శ్రీయా, కాజల్ లాంటి హీరోయిన్లు ఆల్ రెడీ పెళ్లి చేసుకుని.. పిల్లల ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నారు. కానీ, అనుష్క మాత్రం ఇంకా మేకప్ పూసుకుంటూ.. తనకు సినిమాలే సరదా అంటూ కాలక్షేపం చేస్తోంది. నిజానికి గత మూడేళ్ళ నుంచే అనుష్క .. మంచి సంబంధం కోసం చూస్తోందట.
ఇక మధ్యమధ్యలో ‘అనుష్క’ వివాహం పై వచ్చినన్ని రూమర్లు మరో హీరోయిన్ పై రాలేదు. గత పదిహేను సంవత్సరాలుగా అనుష్క పెళ్లి పై రూమర్లు వస్తూనే ఉన్నాయి. సహజంగా ‘కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు, కానీ స్టార్ హీరోయిన్ అనుష్కకు మాత్రం ఆ కళ్యాణ ఘడియలు ఎందుకు రావడం లేదో ?

అసలు అనుష్క ఎందుకు పెళ్ళికి దూరంగా ఉంది ? అనుష్క – ప్రభాస్ మధ్య నిజంగానే ప్రేమ కథ నడుస్తోందా ? ఇలా సాగుతున్నాయి సోషల్ మీడియాలో అనుష్క పెళ్లి పై కామెంట్స్. అనుష్క మాత్రం ఈ కామెంట్స్ పై రియాక్ట్ కావడం లేదు. పెళ్లి అనగానే సైలెంట్ అయిపోతుంది అనుష్క.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి హీరో వస్తోన్న సినిమాలో నవీన్ పోలిశెట్టి సరసన నటించబోతుంది. అలాగే అనుష్క మరో లేడి ఓరియెంటెడ్ సినిమా చంద్రముఖి సీక్వెల్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా అనుష్క మాత్రం బాహుబలి సినిమాతో దేవసేనగా పాన్ ఇండియా రేంజ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.