Homeఎంటర్టైన్మెంట్jabardast show : ఆ జబర్దస్త్ కమెడియన్ ను కొట్టారటగా?!

jabardast show : ఆ జబర్దస్త్ కమెడియన్ ను కొట్టారటగా?!

jabardast show : జబర్దస్త్ కామెడీ షో పాపులారిటీ ఏంటన్నది అందరికీ తెలిసిందే. తెలుగు బుల్లి తెరపై ఏ షోకూ సాధ్యం కానంత క్రేజ్ సంపాదించింది. అందరినీ నవ్విస్తూ ఏళ్ల తరబడి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అయితే.. కామెడీ స్కిట్స్ చేయడానికి కంటిస్టెంట్స్ ఎంచుకునే టాపిక్స్ అప్పుడప్పుడూ ఇబ్బందులకు దారి తీస్తున్నాయి. సెన్సిటివ్ విషయాలను సెలక్ట్ చేసుకొని స్కిట్స్ చేస్తే.. ఎవరో ఒకరి మనోభావాలు గాయపడటం.. క్షమాపణలకు డిమాండ్ చేయడం.. హద్దు దాటి చేయి చేసుకోవడం కూడా జరుగుతోంది. తాజాగా మరోసారి ఇదే పరిస్థితి ఎదురైనట్టు సమాచారం.

Jabardasth

కొన్ని సంవత్సరాల కింద ఓ కుల వృత్తిని అవమాన పరిచారని జబర్దస్త్ స్టార్ టీం లీడర్ పై కొందరు దాడి చేశారు కూడా.. అప్పట్లో ఈ విషయం సంచలనం రేకెత్తించింది. అందరూ చూస్తుండగానే సీనియర్ టీం లీడర్ పై చేయి చేసుకున్నారు.

ఇప్పుడు మరో స్టార్ టీం లీడర్ పైనా అదేవిధంగా ఎటాక్ జరిగిందన్న వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఇటీవల ఓ నటుడు మాట్లాడిన మాటలపై, ఆయన వ్యవహార శైలిపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. మీం స్ తో నెటిజన్లు మోతెక్కించారు.

ఇవే డైలాగ్స్ తీసుకొని జబర్దస్త్ షోలో స్కిట్ చేశాడు ఆ స్టార్ టీం లీడర్. ఈ విషయం సదరు నటుడికి తెలియడంతో.. ఆయన సన్నిహితులు ఫీలయ్యారట. దీంతో ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారట. బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారట. దెనికి అతను అంగీకరించకపోవడంతో.. సెట్ కు వెళ్లి పంచాయితే పెట్టుకున్నారట.

ఈ క్రమంలో అతనిపై చేయి కూడా చేసుకున్నారట. దీనికి సంబంధించిన న్యూస్ బయటకు రాకుండా చూశారట. మరి ఇందులో నిజం ఎంత అన్నది తెలియదిగానీ.. క్రిష్ణా నగర్ లో మాత్ర న్యూస్ సర్క్యులేట్ అవుతోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version