Mannava Balayya Passed Away: ప్రముఖ సీనియర్ నటుడు మన్నవ బాలయ్య(92) శనివారం తుదిశ్వాస విడిచారు. యువకుడిగా ఉన్న సమయంలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య దాదాపు 300పైగా సినిమాల్లో నటించి అభిమానులను అలరించారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా బాలయ్య చిత్రసీమకు సేవలందించారు.

మన్నవ బాలయ్య తన పుట్టినరోజు నాడే కన్నుమూయడం విషాదంగా మారింది. యూసప్ గూడలోని తన నివాసంలో బాలయ్య కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మ చేకూరాలని కోరుతున్నారు.
బాలయ్యకు చిత్ర సీమతో దాదాపు ఐదు దశాబ్దాల నుంచి అనుబంధం ఉంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న బాలయ్య దిగ్గజ నటులతో కలిసి నటించారు. తండ్రిగా, విలన్ గా, ఏ పాత్రనైనా సరే సమర్థవంతగా పోషించి ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని దక్కించుకున్నారు.
పాతతరం హీరోలైన ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర్ రావు, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు తదితర దిగ్గజ నటులతో ఆయన నటించారు. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘మల్లీశ్వరి’, నాగర్జున నటించిన ‘అన్నమయ్య’ చిత్రాల్లో ఆయన పాత్రకు మంచి పేరు దక్కింది.
అలాగే పార్వతీ కల్యాణం, యమలీల, శ్రీరామ రాజ్యం వంటి చిత్రాల్లో నటించారు. బాలయ్య నటుడిగానే కాకుండా దర్శకుడిగా, రచయితగా పని చేశారు. అమృత ఫిల్మ్ సంస్థ బ్యానర్లో ‘చెల్లిలి కాపురం’, నేరము-శిక్ష’, ‘చుట్టాలున్నారు జాగ్రత్త’, ‘ఊరికిచ్చిన మాట’ వంటి చిత్రాలను నిర్మించారు.
‘పసుపు తాడు’, ‘నిజం చెబితే నేరామా’, ‘పోలీసు అల్లుడు’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ‘ఊరికిచచిన మాట’ సినిమాకు గాను ఉత్తమ కథా రచయితగా, ‘చెల్లిలి కాపురం’ సినిమా నిర్మాతగా నంది అవార్డును అందుకున్నారు.
[…] […]
[…] […]
[…] Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ గత కొన్నేండ్లుగా వస్తున్న సీజన్లలో ఓ సాంప్రదాయం ఉంది. ప్రతి సీజన్‌లో కూడా అది వస్తూనే ఉంది. ఇప్పుడు నాన్ స్టాప్ లో కూడా ఆ ఘట్టం రానే వచ్చేసింది. అదేనండి కంటెస్టెంట్లు తమ పాత ప్రేమకథల గురించి చెప్పే ముచ్చట. అయితే తాజా ఎపిసోడ్‌లో అషు రెడ్డి తన గత ప్రేమ కథ గురించి చెప్పి అందరినీ షాక్‌కు గురి చేసింది. […]