సినీ ఇండస్ట్రీలో మళ్ళీ మరో విషాదం చోటుచేసుకుంది. మాజీ హీరోయిన్ తండ్రి కన్నుమూశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘తొలిప్రేమ’ సినిమాలో నటించిన మాజీ హీరోయిన్ ‘కీర్తి రెడ్డి’ తండ్రి, ప్రముఖ టీఆర్‌ఎస్ నాయకుడు కేశ్‌పల్లి ఆనందరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు ఉన్నట్టు ఉండి సడెన్ గా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహటిన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిట్‌లో అడ్మిట్ చేశారు.
అయితే, మొదట్లో వైద్యానికి కోలుకుంటున్నట్లు కనిపించినప్పటికీ, చివరకు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. ఆనందరెడ్డి నిజామాబాద్ మాజీ ఎంపీ కేశ్‌పల్లి గంగారెడ్డి కుమారుడు. యూత్ లీడర్ గా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన, 2014లో నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేశారు, కానీ ఆయన ఓడిపోయారు.
ఆ తర్వాత టీఆర్‌ఎస్ లో చేరి ప్రస్తుతం ఆయన టీఆర్‌ఎస్ లోనే కొనసాగుతున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలుగా అందులో కీర్తిరెడ్డి ఒకరు. 2004లో హీరో సుమంత్ తో కీర్తి రెడ్డి వివాహం జరిగింది. అయితే, ఈ జంట రెండేళ్లకే విడాకులు తీసుకుంది. అనంతరం కీర్తి మరో పెళ్లి చేసుకొని బెంగుళూరులో స్థిరపడింది. ఆనందరెడ్డి మరణ వార్తతో కీర్తి రెడ్డి ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి.
మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున కేశ్‌పల్లి ఆనందరెడ్డి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.