Viral Cinema: సినిమా వైరల్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకొణె జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించింది కూతురు దీపికా పదుకొణె. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దీపికా.. ఏ సౌకర్యాలు లేని రోజుల్లో నాన్న బ్యాడ్మింటన్‌లో అద్భుత విజయాలు సాధించారు. ఆయన విజయం వెనుక కష్టాలను కూడా ఈ చిత్రం ద్వారా చూపించాలనుకుంటున్నా అని, ఈ సినిమాను తానే నిర్మిస్తున్నట్లు దీపికా తెలిపింది.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. పూరి జగన్నాధ్ తనయుడు ఆకాశ్ నటిస్తున్న చిత్రం చోర్ బజార్. ఇందులోని ఓ వైవిధ్యమైన పాట విడుదలైంది. ర్యాప్ తరహాలో సాగే ఈ పాటకు వినసొంపైన బాణీ కట్టాడు సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి. కాస్త గల్లీబాయ్‌ని గుర్తుకు తెప్పించినా పాట ఆకట్టుకుంటుంది. ఇక ఇందులో ఆకాశ్ ఒక దొంగగా నటిస్తున్నాడని విజువల్స్ చెబుతున్నాయి. జార్జ్ రెడ్డిని తెరకెక్కించిన జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
Also Read: యాదాద్రి మహాయాగం వాయిదాకు కారణాలేంటి?

అలాగే మరో క్రేజీ అప్ డేట్ ఏమిటంటే.. ‘ఆకాశమే హద్దురా’, ‘జై భీమ్’ చిత్రాలతో ఓటీటీ వేదికగా వరుస విజయాలు అందుకున్నారు కథానాయకుడు సూర్య. ఇప్పుడు ‘ఈటి’తో వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. పాండిరాజ్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.

కాగా శుక్రవారం ఈ చిత్ర తమిళ టీజర్‌ను విడుదల చేశారు. సూర్య నుంచి ఆశించే అన్ని రకాల మాస్ అంశాలతో సినిమాను తీర్చిదిద్దినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.
Also Read: మహేశ్ బాబు ఖాతాలో కొత్త యాడ్.. వీడియో హాలివుడ్ రేంజ్‌లో ఉందిగా..!