https://oktelugu.com/

Viral Cinema: వైరల్ అవుతున్న టుడే మూవీ అప్ డేట్స్

Viral Cinema: సినిమా వైరల్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. భారత మహిళల కెప్టెన్ మిథాలీ రాజ్ జీవితకథ ఆధారంగా కొత్త చిత్రం తెరకెక్కబోతుంది. ‘శభాష్ మిథు’ పేరుతో వస్తున్న ఈ చిత్రంలో తాప్సీ పన్ను మిథాలీ రాజ్గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాకు శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. వయాకామ్18 స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. మరో అప్ డేట్ విషయానికి వస్తే.. […]

Written By: , Updated On : March 9, 2022 / 04:09 PM IST
Follow us on

Viral Cinema: సినిమా వైరల్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. భారత మహిళల కెప్టెన్ మిథాలీ రాజ్ జీవితకథ ఆధారంగా కొత్త చిత్రం తెరకెక్కబోతుంది. ‘శభాష్ మిథు’ పేరుతో వస్తున్న ఈ చిత్రంలో తాప్సీ పన్ను మిథాలీ రాజ్గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాకు శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. వయాకామ్18 స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది.

sabash mithu

sabash mithu

మరో అప్ డేట్ విషయానికి వస్తే.. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని బాలీవుడ్ నటి రాఖీ సావంత్ తెలిపింది. అవకాశాలు రావాలంటే ముఖం, శరీరం చక్కని ఆకృతిలో ఉండాలని కొందరు చెప్పారని, దీంతో 15 ఏళ్ల వయసులోనే బ్రెస్ట్ సర్జరీ చేయించుకున్నట్లు పేర్కొంది. బాలీవుడ్‌లో చోటు సంపాదించాలని కలలు కన్నానని చెప్పింది. ఇటీవలే భర్త రితేష్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే.

rakhi sawant

rakhi sawant

ఇక మరో అప్ డేట్ ఏమిటంటే.. తాజాగా ఓ పెళ్లి కూతురు.. భాంగ్రా డ్యాన్స్‌తో దుమ్ము రేపింది. పెళ్లి కుమారుడిని మించి స్టెప్పులు వేసి ఆశ్చర్యపరిచింది. గోల్డ్ కలర్ లెహంగాలో మెరిసిపోతూ.. నువ్వా నేనా అన్నట్లు, వరుడితో పోటీ పడి డ్యాన్స్ చేసింది. ఫిదా అయిన వరుడు తన చేతిలో కరెన్సీ నోట్లను ఆమెపై విసురుతూ చిందులేశాడు. ముఖంలో చిరునవ్వు, మ్యూజిక్ తగ్గట్లు నృత్యం చేస్తూ అందరినీ ఆకట్టుకుంది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Also Read: Tollywood: ఇరు రాష్ట్రాల సీఎంలకు థాంక్స్ – రాజమౌళి

ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పొన్నియన్‌ సెల్వన్‌-1 విడుదల తేదీని ఖరారు చేసుకుంది. సెప్టెంబర్‌ 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఇటీవల విడుదలైన ఐశ్వర్యరాయ్‌, త్రిష, విక్రమ్‌, జయం రవి, కార్తి ఫస్ట్‌ లుక్స్‌ ట్రెండింగ్‌లో ఉన్నాయి.

Ponniyin Selvan

Ponniyin Selvan

Also Read: Samantha: అందులో కూడా రాణిస్తాను – సమంత

Tags