Supermoon: నేడు ఆకాశంలో అద్భుతం చోటుచేసుకోనుంది. ఈరోజు సూపర్ మూన్ ఆకాశంలో కనువిందు చేయనుంది. ఈ ఏడాది చివరి పౌర్ణమి సందర్భంగా చంద్రుడు సంపూర్ణంగా కనిపించనున్నాడు. 99.5%తో ప్రకాశవంతంగా దర్శనం ఇవ్వనున్నాడు. దీనిని కోల్డ్ మూన్ అని కూడా పిలుస్తారు. ఈరోజు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఏడాదిలోనే అతి పెద్దదైన రాత్రి ఈరోజు రానుంది.
రేపు ఉదయం 6.03 గంటల వరకు చందమామ కనిపించనుంది. తెల్లవారుజామున సంపూర్ణ పౌర్ణమి ఆవిష్కృతం కానుంది. సంపూర్ణ పౌర్ణమిని చూడడానికి సరైన టైం తెల్లవారుజాము. భూమి ఉత్తర ద్రవం సూర్యుడికి బాగా దూరంగా ఉన్నప్పుడు ఇది సంభవిస్తుంది. ఈ ఏడాది జూన్ 21, డిసెంబర్ 21న కూడా లాంగెస్ట్ నైట్ నమోదు అయ్యింది.
ఆగస్టు నెలలో రెండు సూపర్ మూన్ లు ఆకాశంలో దర్శనమిచ్చాయి. ఆగస్ట్ 2న, 30న బ్లూ బ్లూ మూన్లు ఆవిష్కృతం అయ్యాయి. ఈ ఏడాదిలో ఇలాంటి సుందర దృశ్యాలు ఆవిష్కృతం కావడం విశేషం. ఇలాంటి ఘటనలు 2037 వరకు మళ్లీ జరగవని, ఇదో పెద్ద వింత అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.