Tollywood Updates: బన్నీ కెరీర్ కి ‘అల వైకుంఠపురములో’ సినిమా ఎంతో కీలకం. అయితే, ‘అల వైకుంఠపురములో’ హిందీ డబ్బింగ్ థియేటర్ రిలీజ్ ఇప్పటికే వాయిదా పడింది. అయితే ఈ చిత్ర హక్కులు సొంతం చేసుకున్న గోల్డ్మైన్స్ సంస్థ తాజాగా మరో ప్రకటన చేసింది. ఫిబ్రవరి 6న ఈ చిత్రాన్ని తమ సొంత ఛానలైన ‘ఢించక్ టీవీ’లో ప్రసారం చేయనున్నట్లు తెలిపింది. ‘అల వైకుంఠపురములో’ చిత్రాన్ని హిందీలో కార్తీక్ ఆర్యన్, కృతిసనన్ జోడీగా రీమేక్ చేశారు. దీనికి ‘షెహజాదా’ అని టైటిల్ ఖరారు చేశారు.
ఇక ఊరమాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘పుష్ప’ సినిమాలో ప్రతి పాటా సెన్సేషనల్ అయ్యింది. తాజాగా కొరియన్ ప్రముఖ పాప్ సింగింగ్ బ్యాండ్ బీటీఎస్ చేసిన ‘బాయ్ విత్ లవ్’ వీడియోకు ‘ఊ అంటావా మావ’ పాటను జత చేస్తూ ఓ నెటిజన్ స్పెషల్ వీడియోను క్రియేట్ చేశాడు. ‘పుష్ప’ బీట్‌ని బీటీఎస్ ఫాలో కాలేదు. బీటే బీటీఎస్‌ని ఫాలో అయ్యింది’ అని నెటిజన్ రాసుకొచ్చాడు. మొత్తానికి సమంత సాంగ్‌కు బీటీఎస్ స్టెప్పులు వైరల్ అవుతున్నాయి.
Tollywood Updates
Also Read: ప్రభాస్-పూజా లేకుండానే రొమాన్స్.. ఆ సాంగ్ హైలెట్ అట !
అన్నట్టు బోయపాటి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో కొత్తగా చెప్పక్కర్లేదు. కాగా కొవిడ్ సెంకడ్ వేవ్ తర్వాత థియేటర్లకు పూర్వవైభవాన్ని తెచ్చిన చిత్రంగా నిలిచింది అఖండ సినిమా. పైగా విజయవంతంగా ఇటీవలే 50 రోజులు పూర్తిచేసుకుంది. అయితే జనవరి 21న ఈ చిత్రం ఓటీటీలో విడుదలై. 24 గంటలు కూడా గడవకముందే 1 మిలియన్ స్ట్రీమింగ్స్ సాధించింది.
Tollywood Updates
Also Read: ‘ఎఫ్ 3’ కి అడ్డంకిగా మారిన ‘ఆర్ఆర్ఆర్’ !