https://oktelugu.com/

Today Movie Updates: వైరల్ అవుతున్న టుడే క్రేజీ మూవీ అప్ డేట్స్ !

Today Movie Updates: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. బాలీవుడ్ నటి మలైకా అరోరా.. పొట్టి దుస్తుల విషయంలో తరచూ విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు. తాజాగా తన వస్త్రధారణపై ఆమె స్పందించారు. ‘ఇతరులు చెప్పినట్లు నా జీవితాన్ని గడపలేను. నేను తెలివితక్కువదాన్ని కాదు. నాకు ఏది బాగా అనిపిస్తే ఆ డ్రెస్ వేసుకుంటా. అలాగే ఏం చేయకూడదో కూడా నాకు బాగా తెలుసు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అలాగే మరో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 23, 2022 / 05:30 PM IST
    Follow us on

    Today Movie Updates: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. బాలీవుడ్ నటి మలైకా అరోరా.. పొట్టి దుస్తుల విషయంలో తరచూ విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు. తాజాగా తన వస్త్రధారణపై ఆమె స్పందించారు. ‘ఇతరులు చెప్పినట్లు నా జీవితాన్ని గడపలేను. నేను తెలివితక్కువదాన్ని కాదు. నాకు ఏది బాగా అనిపిస్తే ఆ డ్రెస్ వేసుకుంటా. అలాగే ఏం చేయకూడదో కూడా నాకు బాగా తెలుసు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

    Malaika Arora

    అలాగే మరో టాపిక్ విషయానికి వస్తే.. విడాకులు అనంతరం కెరీర్‌లో స్పీడ్‌ పెంచారు నటి సమంత. ఈ క్రమంలో ఆమె తొలిసారి ఓ ఐటమ్‌ సాంగ్‌లో తళుక్కున మెరిశారు. ‘పుష్ప’ సినిమా కోసం ‘ఊ అంటావా మావ’ అంటూ బన్నీతో కలిసి స్టెప్పులేశారు. తాజాగా విజయ్‌ దేవరకొండ ‘లైగర్‌’ సినిమాలో సామ్‌కు ఛాన్స్‌ వచ్చినట్లు సమాచారం. ఐటమ్ సాంగ్‌ కోసం ఎవరైనా స్టార్‌ హీరోయిన్‌ను ఎంచుకోవాలని పూరీ జగన్నాథ్‌, ఆయన టీమ్‌ భావిస్తోందట.

    Also Read: ప్చ్.. ప్రగ్యా ముచ్చట తీర్చే నిర్మాత ఎవరో ?

    Samantha

    ఇక ప్రస్తుతం నేషనల్ వైడ్ గా వైరల్ అవుతున్న మరో టాపిక్.. జాతిపిత మహత్మ గాంధీ మరణానికి కారణమైన నాథురాం గాడ్సే జీవితం ఆధారంగా తెరకెక్కించిన సినిమా ‘వై ఐ కిల్డ్ గాంధీ’. ఈ చిత్రాన్ని గాంధీ వర్ధంతి రోజు అంటే జనవరి 30న ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు ఆ చిత్రం గాంధీని కించ పరిచేలా.. పూర్తి విరుద్ధంగా ఉందని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ పేర్కొంది. ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ.. అసోసియేషన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. మరి ప్రధాని ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

    Also Read: ఈ మూవీలు థియేటర్స్‌లో ఫ్లాప్.. బుల్లితెర‌పై బ్లాక్ బ‌స్ట‌ర్‌..!

    Tags