Tiger Nageswara Rao : మాస్ మహరాజ్ రవితేజ కెరీర్లో భారీ హైప్ మధ్య విడుదలైన చిత్రం టైగర్ నాగేశ్వరరావు. యంగ్ డైరెక్టర్ వంశీ కృష్ణ తెరకెక్కించాడు. టైగర్ నాగేశ్వరరావు ప్రోమోలు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దసరా కానుకగా టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 20న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల చేశారు. అయితే మొదటి షో నుండే టైగర్ నాగేశ్వరరావు నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపించినా సెకండ్ హాఫ్ నిరాశపరిచిందన్న మాట వినిపించింది. దాదాపు 3 గంటల నిడివితో టైగర్ నాగేశ్వరరావు విడుదలైంది.
సినిమా ల్యాగ్ అయిందనేది కూడా ప్రేక్షకుల అభిప్రాయం. ఈ క్రమంలో దాదాపు అరగంట సినిమా కట్ చేసి మరో వెర్షన్ వదిలారు. అయినా ఫలితం మారలేదు. దసరా బరిలో నిలిచిన భగవంత్ కేసరి, లియో చిత్రాల నుండి గట్టి పోటీ ఎదురైంది. అయినప్పటికీ టైగర్ నాగేశ్వరరావు రీజనబుల్ వసూళ్లు రాబట్టింది. వరల్డ్ వైడ్ రూ. 20 కోట్ల షేర్ రాబట్టింది. దాదాపు రూ. 15 నష్టాలు మిగిల్చింది.
కాగా టైగర్ నాగేశ్వరరావు ఓటీటీ విడుదలకు రంగం సిద్దమైందట. ఖచ్చితంగా నాలుగు వారాల్లో టైగర్ నాగేశ్వరరావు ఓటీటీలో స్ట్రీమ్ కానుందట. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ టైగర్ నాగేశ్వరరావు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది. రూ. 15 కోట్లకు డీల్ ముగిసిందట. ఈ క్రమంలో నవంబర్ 24 నుండి టైగర్ నాగేశ్వరరావు స్ట్రీమ్ కానుందని సమాచారం అందుతుంది.
టైగర్ నాగేశ్వరరావు స్టూవర్టుపురం గజదొంగ బయోపిక్. 70లలో నాగేశ్వరరావు దేశాన్నే వణికించాడు. పెద్దలను దోచి పేదలను పెట్టే నాగేశ్వరరావు జనాల మనస్సులో టైగర్ నాగేశ్వరరావు అయ్యాడు. ఇండియన్ రాబిన్ హుడ్ గా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ తెరకెక్కించాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. రవితేజతో అది సాకారం అయ్యింది. రవితేజకు జంటగా నుపుర్ సనన్ నటించింది. రేణూ దేశాయ్ కీలక రోల్ చేసింది.