Tollywood Tier 2 Heroes: చిన్న హీరోలకు కొన్ని సినిమాల ద్వారా మంచి పేరు వస్తుంది. అంతేకాదు అదే పేరుతో మంచి డైరెక్టర్ల దగ్గర ఛాన్స్ లు కూడా దొరుకుతాయి. కానీ ఎందుకు స్టార్ హీరోల లిస్ట్ లు మాత్రం చేరలేకపోతారు. అందుకే ఇంకెంతకాలం మాకు ఈ మీడియం రేంజ్ ట్యాగ్ లైన్.. మేం కూడా స్టార్స్ అనిపించుకోవాలి కదా అంటున్నారు మన టయర్ 2 హీరోలు. మరి స్టార్ పేరు సంపాదించాలని కావచ్చు ఖతర్నాక్ ప్లానింగ్‌తో ముందుకొస్తున్నారు. కొడితే కుంభస్థలమే అన్నట్లు.. నాని, విజయ్ దేవరకొండ టూ సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వరకు అంతా ఒకే దారిలో వెళ్తున్నారు. మరి ఏంటా రూట్.. అసలు దేనికోసం వీళ్ళ ప్లానింగ్..? అనే వివరాలు చూసేద్దాం…
తెలుగు ఇండస్ట్రీలో 100 కోట్లకు పైగా మార్కెట్ ఉన్న హీరోలు ఎవరయ్యా అంటే అందరికి ఠక్కున గుర్తు వచ్చే పేరు ప్రభాస్, అల్లు అర్జున్, చరణ్, ఎన్టీఆర్, పవన్, మహేష్ బాబు. వీరు అందరికంటే ముందు వరుసలో ఉంటారు. ఇక వీరితో పాటు సీనియర్ స్టార్లలో చిరు, బాలయ్య ముందున్నారు. స్టార్లు ఒకే సీనియర్లు ఒకే మరి వీరి తర్వాత స్థానం ఎవరిది అనుకుంటున్నారా? ఇంకెవరు మన రౌడీ భాయ్ విజయ్ దేవరకొండ, రవితేజ, నాని, నితిన్, నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్ లాంటి హీరోలు మీడియం రేంజ్‌లో ఉన్నారు.
పాన్ ఇండియన్ సినిమాల హవా మొదలైన తర్వాత హీరోల రేంజ్ పెరిగిపోయింది. అందుకే తమ మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నారు మీడియం రేంజ్ హీరోలు. దీనికోసమే ఖతర్నాక్ ప్లాన్ చేస్తున్నారు. ఖతర్నాక్, ఖతర్నాక్ అంటున్నారు ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా? అదే అండీ బడ్జెట్ మంత్రం.. తమ మార్కెట్‌కు మించి బడ్జెట్‌తో సినిమాలు చేస్తున్నారు. నాని, దసరా.. విజయ్ దేవరకొండ, లైగర్.. రవితేజ, టైగర్ నాగేశ్వరరావు లాంటి సినిమాలే దీనికి నిదర్శనం. సినిమా హిట్టా ఫట్టా అనేది పక్కనబెడితే ముందు బడ్జెట్ పెరిగితే.. హీరో రేంజ్ కూడా పెరుగుతుంది.
దీనికి బెస్ట్ ఉదాహరణ నాని. దసరా సినిమాకు ముందు ఒక్కసారి కూడా 40 కోట్ల మార్క్ అందుకోని నాని.. ఈ సినిమాతో ఏకంగా 65 కోట్లు షేర్.. 110 కోట్ల గ్రాస్ వసూలు చేసారు. అలాగే లైగర్ ఫ్లాప్ అయినా.. ఫస్ట్ డేనే 34 కోట్లు వసూలు చేసింది. బడ్జెట్ పెరిగితే.. మార్కెట్ కూడా పెరుగుతుంది. వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ సినిమా నాన్ థియెట్రికల్ రైట్సే 50 కోట్లకు అమ్ముడయ్యాయి. దానికి కారణం ఆ సినిమా గ్రాండియరే. అలాగే ఏజెంట్ తర్వాత అఖిల్ మరోసారి భారీ బడ్జెట్ సినిమానే చేయబోతున్నారు. సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది సినిమా సైతం 50 కోట్ల రేంజ్‌లోనే రాబోతుంది. మొత్తానికి తెలివిగా మార్కెట్ పెంచుకుంటున్నారు మన హీరోలు.
పైసామే పరమాత్మహై అన్నట్టు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ భారీగా ఆర్జించాలి.. అప్పుడే కదా మనం కూడా స్టార్లుగా అవతారం ఎత్తేది పాన్ ఇండియా స్టార్లుగా మారేది అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నారు మీడియం హీరోలు. మరి ఇందులో మీ ఫేవరేట్ హీరోలు కూడా ఉండే ఉంటారు కదా.. ఇంకెందుకు ఆలస్యం కాస్త వారి సినిమాలకు బడ్జెట్ పెరిగేట్టుగా ఓటీటీలో కాకుండా థియేటర్ కు వెళ్లి సినిమాలు చూడండి. బాక్సాఫీస్ లెక్కలను తారుమారు చేసేయండి. మరో నలుగురిని కూడా తోడుకు తీసుకెళ్లండి కుదిరితే…. ఎందుకంటే వారి భవిష్యత్తును నిలబెట్టేది బాక్సాఫీస్ లెక్కలే కదా…
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Tier 2 heroes who say they will become stars
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com