AP Movie Ticket Rates: ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్స్ ధరల విషయంలో తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. భారీగా టికెట్స్ రేట్లు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పల్లె ప్రాంతాల్లో ఉన్న థియేటర్ టికెట్ ధర అయితే ఏకంగా రూ. 5 గా నిర్ణయించింది. ఈ రేట్లతో చిత్ర పరిశ్రమ మనుగడ కష్టమని పెద్దలు గగ్గోలు పెట్టారు. ఈ క్రమంలో మాటల దాడి చోటు చేసుకుంది. వివాదం పెద్దది కాకముందే చిరంజీవి నేతృత్వంలో కొందరు పెద్దలు ఏపీ సీఎం వైఎస్ జగన్ ని కలిశారు.
చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, అలీ, ఆర్ నారాయణమూర్తి సీఎం జగన్ ని కలిసి ప్రతిపాదనలు సమర్పించారు. అనంతరం టికెట్స్ ధరలు కొంత మేరకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంతో పోల్చితే ఇప్పటికీ ఏపీలో తక్కువ రేట్లు అమలులో ఉన్నాయి. ఇక పెద్ద చిత్రాలకు టికెట్స్ ధరలు పెంచుకునే వెసులుబాటు కొన్ని కండిషన్స్ మీద ఇచ్చారు.
హీరో, డైరెక్టర్ రెమ్యూనరేషన్ మినహాయించి వంద కోట్ల బడ్జెట్ అయిన చిత్రాల టికెట్స్ రేట్లు మొదటి పది రోజులు పెంచి అమ్ముకోవచ్చు. అయితే ఆ మూవీ చిత్రీకరణ 20 శాతం ఏపీలో జరగాలని కండీషన్ పెట్టారు. అయితే ప్రభుత్వం ఈ నిబంధనలు పాటిస్తున్న సూచనలు కనిపించడం లేదు. సలార్ చిత్రానికి టికెట్ ప్రైస్ రూ. 40 పెంచుకునే అవకాశం కల్పించారు. గుంటూరు కారం చిత్రానికి రూ. 50 పెంచారు.
గుంటూరు కారం కంటే సలార్ మూవీ అత్యధిక బడ్జెట్ మూవీ. కానీ గుంటూరు కారంకి అధిక ధర ఇచ్చారు. ఈ క్రమంలో నిబంధనలు పాటించకుండా తమకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్మాత నట్టి కుమార్ ఇదే విషయం లేవనెత్తారు. ఏపీ ప్రభుత్వం ఒక్కో హీరో విషయంలో ఒక్కోలా ప్రవర్తిస్తుంది అంటూ ఆరోపణలు చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ చిత్రాల విడుదల సమయాల్లో ఏపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిన విషయం తెలిసిందే….