Thug Life Collection: కమల్ హాసన్(Kamal Haasan) కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి, అదే విధంగా డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఏ డిజాస్టర్ ఫ్లాప్ సినిమా కూడా ఆయన మార్కెట్ పై ప్రభావం చూపించేంతగా ఎప్పుడూ జరగలేదు. మధ్యలో కొంత గడ్డు కాలం గడిచిన రోజులు కూడా ఉన్నాయి కానీ ‘విక్రమ్’ సినిమా నుండి కమల్ హాసన్ మళ్ళీ తన మార్కెట్ ని తెచ్చుకున్నాడు. కానీ ‘విక్రమ్’ తర్వాత ఆయన హీరో గా నటించిన ‘ఇండియన్ 2’ పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా తర్వాత మణిరత్నం(Mani Ratnam) తో ఆయన కలిసి చేసిన ‘థగ్ లైఫ్'(Thug Life Movie) చిత్రం ఇటీవలే గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమా అయితే ‘ఇండియన్ 2’ కి మించిన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ‘ఇండియన్ 2’ కి ఫుల్ రన్ లో దాదాపుగా 150 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
కానీ ‘థగ్ లైఫ్’ చిత్రానికి కనీసం 100 కోట్ల గ్రాస్ వసూళ్లు కూడా వచ్చేలా కనిపించడం లేదు. మొదటి వారం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లు చూస్తే డిజాస్టర్ అనే పదం చాలా చిన్నది అవుతుందేమో. హీరో నితిన్ తెలుగు రాష్ట్రాల రైట్స్ ని 18 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసాడు. మొదటి వారం కేవలం రెండు కోట్ల 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. అంటే కనీసం 10 శాతం రికవరీ కూడా అవ్వలేదు. ఇంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ కమల్ హాసన్ కెరీర్ లోనే లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తమిళనాడు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. 7వ రోజున ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి కేవలం రెండు కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చింది.
ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే తమిళనాడు లో 37 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం,కేరళలో రెండు కోట్ల 50 లక్షలు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా లో 4 కోట్ల 15 లక్షలు, ఓవర్సీస్ లో 36 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మొత్తం మీద ఈ చిత్రానికి మొదటి వారం 83 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుందా లేదా అనేది ఈ వీకెండ్ లో వచ్చే వసూళ్లను బట్టీ తెలుస్తుంది. ఈ చిత్రానికి కమల్ హాసన్ నిర్మాతగా కూడా వ్యవహరించిన సంగతి తెలిసిందే. థియేట్రికల్ పరంగా నష్టాలు వచ్చినప్పటికీ నాన్ థియేట్రికల్ పరంగా కమల్ హాసన్ లాభాల్లోనే ఉన్నాడు.