Thug Life First Review : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కమల్ హాసన్ (Kamal Hasan) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక డిఫరెంట్ పాత్రలను చేస్తూ తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోల్లో కమల్ హాసన్ కూడా ఒకరు కావడం విశేషం. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని చాలా గొప్ప రేంజ్ లో ఎలివేట్ చేసే ప్రయత్నం అయితే చేశాయి. మరి ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆయన మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ సినిమా చేశాడు. ఈ సినిమా జూన్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ ని సెన్సార్ బోర్డు వాళ్ళకి ఇచ్చేశారు. ఈ సినిమా గురించి సెన్సార్ వాళ్ళు చెప్పిన మాటలు బట్టి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
మాఫియా సామ్రాజ్యాన్ని తన కను సన్నల్లో నడుపుతున్న రంగరాయ శక్తివేల్ కి పోటీ గా మాణిక్యం అనే వ్యక్తి ఉంటాడు. ఈ మాణిక్యం రంగరాయ శక్తివేల్ ను చంపాలని తన మీద కాల్పులు జరుపుతాడు. ఇక ఇదే సమయంలో అమరన్ (శింబు) రంగరాయ శక్తివేల్ ను కాపాడుతాడు. దాంతో రంగరాయ శక్తివేల్ అమరన్ ను తన కొడుకుగా భావించి పెంచుకుంటాడు. ఇక ఆ తర్వాత వీళ్ళ మధ్య పెద్ద గొడవ జరిగి వాళ్లిద్దరు సపరేట్ అయిపోయి ఒకరిని ఒకరు చంపుకోడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మాఫియా కోసం వీళ్ళు ఎందుకు శత్రువులుగా మారారు. ఎవరు ఎవరిని చంపారు అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
ఇక ఈ సినిమాలో మణిరత్నం మేకింగ్ చాలా అద్భుతంగా ఉండబోతుందట. సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ సినిమా మొత్తాన్ని చూసి యు బై ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక ఇందులో కొన్ని బీప్ సౌండ్స్ ని వేసిన వాళ్లు కొన్ని సన్నివేశాలను చూసి ప్రశంసించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రేపు రిలీజ్ అవ్వబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమా మీద మంచి బజ్ అయితే ఉంది. ఈ సినిమాకి రెహమాన్ మ్యూజిక్ నిందించడం ఈ మూవీకి మరొక అడ్వాంటేజ్ గా నిలిచింది.
మణిరత్నం రెహమాన్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు మంచి విజయాలను సాధించిన విషయం మనకు తెలిసిందే. మరోసారి వీళ్ళు మ్యాజిక్ చేయడానికి ప్రేక్షకుల ముందుకు అయితే వస్తున్నారు… ఇక ఈ సినిమాతో వాళ్ళు ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు వాళ్ళకంటూ ఎలాంటి ఐడెంటిటి ఏర్పాటు అవుతుంది అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.